పుట:Kasiyatracharitr020670mbp.pdf/356

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆ డాబా యేనూటికి దైగేపాటి విశాలముగా వున్నది. గుళ్ళో వొఢ్ర బ్రాంహ్మణుని గుండాపూజ నడిపింపుచు అప్రతిగృహీత సంతతివారు యిప్పటికి వుంచుకొని వుండేటందున అందులో దిగినాను. యీవూరికి సమీపముగా జగన్నాధ క్షేత్రములో వుండే పండ్యాలు మొదలైన వారికి ముఖ్యమైన యిష్టదేవత అయిన వొక చండీదేవి ప్రతిమ వొక చిన్న కొండమీద ప్రతిసంవత్సరము తామరసపూజలు అంగీకరింపువువున్నది. నేటిరాత్రి సముద్రతీరమందు యిసుకలో నడిచివచ్చినాము. యెండ కాలములో దారి యిక్కడ నడవడము ప్రయాస అనిపించును. చెట్లనీడకూడా లేదు. యీ 4 కోసులదారికి చెరిసగములో వొక మంచి నీల్లబావి నొక బోగంది తొవ్వించినది వున్నది.

28 తేది వుదయాత్పూర్వము 3 గంటలకు లేచి యిక్కడికి 9 కోసులదూరములో వుండే మాణీక్యపట్టణము 7 గంటలకు చేరినాము. నిన్నదిగిన మజిలీపూరివద్ద వొక వుప్పుటేరు వున్నది. పాటుపోటు కాలాలు చూచి దాటవలెను గాని పడవలువుండే పాటి లోతు కలది కారు. నేటిదారి సముద్రతీరము. యిసుకలో చిలక సముద్రము అనే వుప్పుకయిదారిగా నడిచివచ్చినాము. మాణిక్యపట్టణములో పోలయిసుదారోగా వుంటాడు. యీ వూరు మొదలుగా మూలఝూ అనేవూరువరకు వొక తురకవానికి జాగీరు. యిక్కడా సమస్త పదార్ధములు అంగళ్ళలో దొరుకును. యీవూరివద్ద చిలకసముద్రము దాటవలసి వున్నది గనుకనున్ను యాత్రవారికి దిగడానకు స్థలములేక ప్రయాసపడుతూ వుండినారు గనుక గంజాం కలకటరువద్ద శిరస్తాగా వుండే వెంకన్నపంతులు జాతి విభజనగా దిగడానకు వసతిచేసి సుందరమయిన ధర్మశాల కట్టి సదావృత్తి అందరికి యిస్తూ వున్నాడు. యీ ధర్మశాలలో యీ దినము వసించినాను.

29 తేది వేకువనే 3 గంటలకు లేచి అక్కడికి 4 కోసుల దూరములో నున్న మిఠాగువ్వ అనేవూరు 12 గంటలకు చేరినాను. ఇంత ప్రొద్ధుపోను కారణమేమంటే, బయిలు దేరిన వూరిముందర చిలకసముద్రమనే నది దాటవలెను. అది 2 కోసుల వెడల్పు కద్దు. దాన్ని దాటింఛే హక్కు యిచ్చటి జాగీరువారు డయిన తురకకు యివ్వబడి