పుట:Kasiyatracharitr020670mbp.pdf/358

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మూలుఝూ యీరెంటి మధ్యే యీ దినమంతా నడిచినాను. దారి శుద్ధ యిసక, నిలవ నీడలేదు.

30 తేది ఉదయాత్పూర్వము 4 గంటలకు లేచి యిక్కడికి 5 కోసుల దూరములో వుండే ప్రయాగ అనేవూరు 2 గంటలకు చెరినాను. యీవూరు మొదలుగా మదిరాసు గౌర్నమెంటు యిలాకాతో చేరినది. వూరుగొప్పదేను. అన్నిపదార్ధాలు దొరుకును. యిక్కడ వొకతపాలా రైటరు గంజాం కలకటరుకింద వున్నాడు. సుంకంచావడి వొకటి వున్నది. వచ్చేపొయ్యేవారి మూటముల్లెలు సరిహద్దుజాగా అయినందున ఆ సుంకరులు శొధించి చూస్తారు. యీవూరు మొదలుగా చెన్నపట్టణపు రూకలు చెల్లుచున్నవిగాని యీ ప్రయాగలో పట్టరు. యీ హద్ధుమొదలుగా పిచ్చశేరులు. శేరు 1 కి యిరవై రూపాయల యెత్తు.; శేరు యిన్నిరూకలని వెలగాని యిన్నిఅణాలు పయిసాలు అనుకోవడము లేదు. గంజాములో వుండే వొక గౌరకోమటి యిక్కడ విశాలముగా డాబాకట్టి వొక వనప్రతిష్ట, తటాక ప్రతిష్టయున్ను చేసి భూస్థితికూడా వాటి పరిపాలనకు సంపదించినాడు.

యీ ప్రాంతములలో కొండలు గుహలు అడువులు కల ప్రదేశాలను మన్యా లంటారు. ఆ మన్యాల యజమానులను మన్యదొర లని చెప్పడము, వారి తమకు యిష్టములేనివారి యిండ్లను కలిమిగలవారి యిండ్లనున్ను మనుష్యులకు రాత్రిళ్ళు దివిటీలు యిచ్చి పంపించి కొళ్లపెట్టించి మనుష్యులను నరికించి యిండ్లను కాల్పిస్తూ రావడము సహజముగనుక అదేరీతుగా యీవూరి తపాలారైటరు యిల్లు మరివొకరిద్దరి వర్తకుల యిండ్లున్ను 15 రోజులకిందట యీ ప్రాంత్యపు జమీదారుడు దోపించినాడు. యీ దేశపుజమీదారుడు డాబాభూస్థితిని కప్తీ చేసుకొన్నందున డాబా బేమరామత్తు కింద వసతి తప్పివున్నది. సమీపమందుండే టెంకాయతోపులో డేరాలు వేయించి వంట భోజనము చేసుకొని 1 గంటకు బయలుదేరి యిక్కడికి 7 కోసుల దూరములో వుండే గంజాం అనే షహరు 9 గంటలకు చెరినాను.

వుదయాన నడిచినదారి సముద్రతీరమైనప్పటికి యిసక వొక