పుట:Kasiyatracharitr020670mbp.pdf/352

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


గొప్పది. 1000 యిండ్లు వుండును. రధములుపొయ్యే వీధులు మాత్రము నిండా విశాలముగా వున్నవి. స్వతంత్రుఘుగా శీమనుంచి వచ్చివుండే పేయిర్ అనే దొరను యాత్రవారి మహసూలు వసూలు చేసే పనులలో కలకటరు హస్తాంతరముగా మామూలు ప్రకారము అటారానాళాఘాటువద్ద వుంచి వున్నారు. యాత్రవారి సమేతముగా పండాల విచారణ ఆ దొర పరమై వుంచున్నది. బియ్యము మొదలయిన సమస్త పదార్ధములు అంగళ్ళలో వుండేవి. స్వామికి నివేదనాహ్రములు గనుక వాటిని వాసన చూచి మళ్ళీ ఆ రాసులలో వెయ్యనియ్యరు. యీ నియమము వింతగా యీవూళ్ళో జరుగుచున్నది. మహాజనులనే సాహుకారులు యీ వూళ్ళో లేరు. సమస్త పదార్ధములు దొరుకువున్నవి. యీవూరు సముద్ర తీరమందున్నవి. యిక్కడ సముద్రస్నానము బహుముఖ్యము. జాతులవాండ్లు సముద్రతీరమందు యిసుక దిబ్బలలో వుపాయమైన యిండ్లు కట్తుకుని కాపురమున్నారు.

కొత్త మూర్తులను ప్రతిష్ణచేసిన వెనక గుళ్ళోవుండే పాత మూర్తులను మూటినిన్ని రెండో ప్రాకారములో వుండే మోక్షద్వారమనే కూపములో ప్రవేశింప పెట్టుతారు. ఆ కూపము అగాధమైన లోతని తెలియవచ్దినది. ఆ కూపము వుండే ప్రదేశానకు యిక్కడివారు పోను భయపడుతూ వుంటారు. పాతమూర్తులలో నుండిన చైతన్యకళలను కొత్తమూర్తుల వక్షస్థలములలో ప్రవేశింప పెట్టినవెనక రెండుమూడు నెలలలో ప్రవేశపెట్టిన వృద్ధ కిరాతకులు దేహాలు వదులుతారని నిశ్చయముగా తెలిసినది. దానికారణము యీశ్వరునికే తెలుసును. అయినా నాకు భయమే కారణముగా తొచుచున్నది. యిక్కడ నాలుగు కూరలు పప్పుపులుసు పరమాన్నము రెండు పిండివంటలతో సాధారణముగా వెయింటికి భోజనము చేయించ వలిస్తేయిన్నూటయాభై రూపాయలు సరాసరిపట్టుచున్నవి. యిక్కడ అనేక మకాలున్ను రోగిష్టులకు ప్రసారవినియోగమయ్యే కొరకు కుంఫిణీ ధర్మశాల వొకటిన్ని వుండేటందున బ్రాహ్మణ భోజన నిమిత్తము వొకదినము ముందు పిలిస్తే పండితులు పామరులుసహా