పుట:Kasiyatracharitr020670mbp.pdf/348

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పొయిలుగల వంటశాల విశాలముగా వొకటి కట్టివున్నది. వొక్కొక్కపొయిమీద 12 పిడతలు వుంచి అన్నము పచనమయ్యేటట్టు వయిపు (వీలు) చేసివున్నారు. వొక్కొక్కపొయి 5 వేల రూపాయలకు కదా చిత్తుగా అమ్మకానికి దొరుకుతున్నది. పచనమయ్యే ప్రసాదములో పొయి గలవానికి వరుమానము విస్తారము. నిత్యము రమారమిని అయిదు గరిశల బియ్యము అన్నము భోగ్యముగా నివేదనము అవుతున్నది. పిడతలు చేసే కుమ్మరవాండ్లు 400 యిండ్ల వారున్నారు. ప్రసాదస్వీకారము చేయడములో ఉచ్చిష్టదోషము యెంతమాత్రము పాటించక స్వీకారము చేయుచున్నారు. గుడి లోగడ నీలాద్రిపర్వమున్న తావులో కట్టివున్నది గనుక వూరువుండే భూమి కన్నా గర్భగృహము సుమారు నూరడుగుల పొడుగులో కట్టి వున్నట్టు తోచబడుచున్నది.

గుడికి నాలుగు పక్కలా నాలుగు ద్వారాలువున్నవి. అందులో తూర్పుపక్క ద్వారములో ఒక సింహాన్ని చేసివున్నారు. గనుక దాన్ని సింహద్వారమంటారు. అక్కడ సర్కారు మనుష్యులుంటారు. చీటీ చూచుకొని స్వామిదర్శనానికి గుడిలోపల మనుష్యులను యెంచి విడిచి పెట్టుతారు. జేలేశ్వరమువద్దవుండే సువర్ణ రేఖనది మొదలు గంజాం వద్దవుండే ఋషికుల్యానదివరకు వోఢ్ర దేశముగనుక యీ మధ్యేవుండే కాపురస్తులు జగన్నాధానకు వస్తే యెంతమాత్రము హాశ్శీలు యివ్వనక్కరలేకుండా పూర్వమునించి యేర్పాటు అయివున్నది. యితరదేశస్థులు యెవరువచ్చినా నాలుగుదినములు స్వామి దర్శనము చేసి అయిదోదినము భోజనముచేసి పోవడానకు జమను 1 కి ర్పు 2 రు(2-6-0) యివ్వవలసినది. యెక్కువ దినాలు స్వామిదర్శనము ఆమేక్షిస్తే ఆలెక్కకు త్రైరాశికము మీద రెట్టించి మహసూలు యిచ్చి చీటి పుచ్చుకోవలేను. మహసూలు తీరువచీట్లు యిచ్చేటప్పుఛు పురోహితము వహించిన పండా మారీఫత్తున వాడి పేరుకూడా దాఖలా వ్రాసుకుని యిస్తారు. క్లుప్తమయిన దినాలకు యెక్కువగా యాత్రవారు వుండి పండా తెలియచేయకపోతే 12 రూపా