పుట:Kasiyatracharitr020670mbp.pdf/347

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పార్వతి సరస్వతులు యిద్దరు ఈ స్థలములో తపస్సుచేసి సర్వసాధారణముగా స్త్రీలకు శూద్రులకు కూడా విష్ణుహాప్రసాదము కలిగేటట్టుగా వరము తీసుమున్నారుగనుక అద్యాపి యిక్కడ ప్రసాదము సర్వసాధానణమై తారతమ్యము లేకుండా పరిగ్రహింపబడుతూ వున్నది.

ఆ చొప్పున తపస్సుచేసి అవసరముగా పార్వతి విమలా అనే పేరు ధరించి యీ గుళ్ళో విలసిల్లి ఆమె సంవత్సరోత్సవములో అద్యాపి తామసపూరాంగ మయిన జీవహింసలు అంగీకరింపుచున్నది. విష్ణుగుళ్ళో ఆవరణము లోపల యీ బలులు జరగడము యుక్తముకాదని కొందరు సాత్వికులు యిటీవల విరోధిస్తే వారిని ఉపద్రవపెట్టి యధాప్రకారము ఆశక్తి బలిపూజలు జరిగించుకుంటూ వున్నది. సరస్వతి రజోగుణ ప్రధానురాలు గనుక యధోచితమైన పూజను అంగీకరిస్తూ యీ గుళ్ళో పార్వతివలెనే విశేషనామధేయములేక విలసిల్లివున్నది. యీగుళ్ళో స్నానము చేసినమాత్రాన విష్ణుసారూప్యము కలగచేయ తగ్గపాటి వొక మహాతీర్ధము వుండినదట. తద్ధ్వారా కాకులు మొదలయిన పక్షులకు విష్ణుసారూప్యము కలుగుతూ వచ్చెనట. ఆతీర్ధము యిప్పుఛు కలిసామ్రాజ్యద్వారా అంతర్ధానమై ఆ ప్రదేశాముయొక్క నిశానిమాత్రము చూపింపుచున్నారు. రజస్యమయిన తాపిని మొదలయిన గ్రంధాలలో పరమాత్మ చతుర్ధాకృతిగా ఇక్కడ దర్శనము యిస్తున్నాడని చెప్పేటట్టు తెలిసినది.

ఇక్కడి గుడి నన్నూరు అడుగుల చచ్చవుకములో సుమారు తిరువట్టూరి గుడిపాటి విశాలముగా రెండు ప్రాకారాలు కలిగివున్నది. గర్భగృహము మీద చక్రము వుంచివున్నది. ముఖమంటపము విశాలముగా పయిన పయిన గుంమటము అందము గల స్థూపీ అరటి పువ్వందముగా రెండుతాటిచెట్లపొడుగున కట్టి మీద చక్రము వుంచివున్నది. ముఖమంటపము విశాలముగా పయిన గుంమటము అందముగల కట్టి వున్నది. ముఖమంటపముయొక్క బయిటి ప్రాకారము గోడలో తురకరాయి మీద చిత్తుళిపని బహుసుందరముగా చేసివున్నారు. గర్భగృహము చుట్టూ చిల్లర గుళ్ళ శానా కట్టివున్నవి. గుడిలోపల వొక అక్షయ వటము వొక ముక్తి మంటపము వున్నది. వాటికింద జపము చేస్తే ముక్తిప్రదమని నియమించివున్నారు. వెలిప్రాకారములో నన్నూరు