పుట:Kasiyatracharitr020670mbp.pdf/346

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఇక్కడ ప్రతిష్ట చేసినాడు. అది మొదలుగా యిక్కడ యీశ్వర చైతన్యము ప్రతిఫలించివున్నది---యిక్కడ ప్రసాదమహిమ యెక్కువ కావడానకు కారణము యేమంటే వైకుంఠములో నుండే శ్రీమహావిష్ణుదర్శనానకు సాంబమూర్తిన్ని బ్రహ్మౌయున్ను వెళ్ళినట్లున్ను అప్పుడు లక్ష్మి బ్రహ్మకు శివునికిన్ని యిచ్చినట్టున్ను వీరుభయులు వుచ్చిష్టమని యెంచక మహాప్రసాదమని భుజించి వీరి స్వస్థలాలకు వచ్చినంతలో వీరుభయుల భార్యలుకున్ను వీరుభయులు కళాహీనులై యున్నట్టు తోచి అందుకు కారణమేమని అడిగినంతలో వీ రుభయులు తాము మహాప్రసాదభక్షణ చేసిన వర్తమానము చెప్పగా ఆ యిద్దరుస్త్రీలు ఆ మహాప్రసాదభక్షణ కళావృద్ధి చేయతగ్గదికాని కళాహీనము చేయనేరదే, మరి యేమి పనిచేసినారో అని చెప్పి ఆ ప్రసారము మాకు యేల తెచ్చి యియ్యక పోతిరి అని అడిగినట్తున్ను వీరుభయులు మీరు స్త్రీలు మాయాస్వరూపులు గనుక మహాప్రసాదానకు అర్హులు కారని మీకు తెచ్ఫి యియ్యలేదని చెప్పి మనము కళాహీనులు కావడానకు కారణ మేమో అడిగి తెలుసుకుందా మని మళ్ళీ విష్ణువద్దికి వచ్చినట్టున్ను విష్ణువు వారికి చెప్పడములో మా ప్రసాదభక్షణవల్ల మీరు కళాపరిపూర్ణులు కావలసినవారైనా ఆ మహాప్రసాదము స్వీకరించడములో ఆ ప్రసాదము మీచేతులకు తగిలి పరంపరగా తక్కువయిన అవయవములలో తాకి ప్రసాదాన కగౌరవము మీవల్ల నడిచినది గనుక తన్నిమిత్తమయిన అపరాధముచేత మీరు కళాహీనులైనారని తెలియచెప్పినట్టున్ను అందుకు ప్రాయశ్చిత్తమేమని అడగగా జగన్నధ మహాక్షేత్రములో వొక పుణ్యతీర్ధము వున్నది, ఆ పుణ్యతీర్ధమందు మీరు స్నానము, పానము మొదలయినవి చేసితి రేని తత్పాపపరిహారమగునని చెప్పినట్తున్ను బ్రహ్మరుద్రులు అట్లా చేసినట్లున్ను తదారభ్య యీ స్థలము వదిలిపొయ్యేటప్పుడు యాత్రకు వచ్చినవారు అందరు ఆ తీర్ధములో ప్రసాదవిషయమయిన అపరాధపరిహారార్ధము స్నానపానములు చేస్తారు. ఆ చొప్పున విష్ణుమహాప్రసాదానకు స్త్రీలు అర్హులుకారని తెలిసిన వెనక