పుట:Kasiyatracharitr020670mbp.pdf/349

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


యలు జులుమానా పుచ్చుకుంటారు. గనుక పండావాండ్లు క్లుప్త దినాలకు యెక్కువ వొక గడియ అయినా యాత్రవాండ్లను వుండనీయకుండాకూడా ఘాటీవరకువచ్చి సాగనంపించి లోగడ యిచ్చిన చీటీని మళ్ళీ వెళ్ళీపోయిన ఘాటులో దాఖలుచేసి యాత్రావాండ్లు సాగిపోయిన వయినము లెక్కపెట్టించి రెపోర్టు వ్రాయించివేస్తాడు.

యీ పండాలనే స్థలవాసులని 700 యిండ్లదాకా వున్నవి. వీరు ముప్పదియారు తెగలవారై పూజ వంట మొదలైన పరిచారకము గుళ్ళో చెస్తూవుంటారు. ఈగుడి దేవదాశీలు వింజామరలు మొదలైనవి వేశి వుపచారపు వస్తువులు చేతవుంచుకొని సన్నిధానములో సేవ చేయడముగాని నాట్యమాడడము లేదు. మేళగాండ్లు కొలువులేదు. హాశ్శీలు మూలకముగా లక్షాయిరువైవేల రూపాయిలు సాలుకు వసూలు అవుచున్నవి. అందులో సగముమట్టుకు గుడిసెలవుల నిమిత్తము కుంఫిణీవారు నెలకు సుమారు నాలుగువేల రూపాయిలవంతున యిస్తూవస్తారు. *[1] అన్నిదూపాయిలు ప్రసాదముగా నివేదనచేసి ప్రతి దినపు ప్రసాదాన్ని వారివారి క్లుప్తప్రకారము పంచుకోవలసినదిగాని వొక గవ్వ అయినా రొక్కముగా గుడి యిలాకాదార్లకు దొరకదు

ప్రసాదాలు సింహద్వారము మొదలు ముఖమండపము వరకు గంపలలో పెట్టి అనేక అంగళ్ళుగా అమ్ముతూ వుంటారు. వుచ్చిష్ట వ్యవస్థను విచారించక సమస్త జనులున్ను రుచిచూచి కొనుక్కొనుచున్నారు. కుంఫిణీవరు మహసూలు వసూలుద్వారా పైన వ్రాసిన ప్రకారము యివ్వడము కాకుండా గుడికి కొంత,లాకు జారి భూమిన్ని వుండివున్నది. స్వామిముందర భేటి యనే కానుకలు యేవివుంచినా సరకారు చేరుతున్నవి. యీ మహసూలు ద్వారా సరకారువారికి సమస్త శలవులుపోగా సాలుకు సుమారు పదివేల రూపాయిలు మిగిలేటట్టు తెలిసినది. ♦[2] పండాలకు యాత్ర వారిని యాచించి జీవనము చేయ

  1. * చూడు. యీపుటలోని వ్యాఖ్యానము.
  2. ♦ 1843 సంవత్సరము వరకు దేవాదాయములను కుంఫిణీవారు స్వయముగా పరిపాలించుచుండిరి. కలెక్టరులు రెవెన్యూబోర్డు తనిఖీక్రింద అజమాయిషీ చేయచుండిరి. మిగిలిన సొమ్ము తీసికొనుచుండిరి.