పుట:Kasiyatracharitr020670mbp.pdf/335

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వుగా యెక్కి పడవలమీద వుందవచ్చును. ఈ రెండునదుల పేర్లు కరుసా అనిన్ని బ్రాహ్మణి అనిన్ని చెప్పుతారు. బ్రాహ్మణినది గోపాలపూరుకు వోరగా వున్నది. యీవూళ్ళోను ధర్మశాలలు 200 అడుగుల నిడువు 15 అడుగుల వెడల్పుతో నొక కూటమున్ను ఆరడుగుల వెడల్పుతో నొక తాళువారమున్నూ వేశి రెండుకొనలలో రెండు కొట్టిడీలు కట్టివున్నవి. ఇటువంటి ధర్మశాలలు రెండేశి వొక్కోక్క వూళ్ళో యెదురెదురుగా మధ్యే 400 అడుగుల బయలు విడిచి రమణీయముగా కట్టివున్నవి. మధ్యేవుండే బయిలులో వొక బావి తొవ్వించివున్నారు. యీధర్మశాలలు కుంఫిణీవారు కట్టించి మూడుసంవత్సరములు అయినవి. ప్రతి ధర్మశాలలోను వొక పోలీసు బంట్రౌతును యిద్దరేశి ఝూడుమాలీలను వుంచినారు. యీదినము దిగిన ధర్మశాలకు చేరినట్టుగా సమీపములో వున్నవి. యీవూళ్ళో సమస్తమైన పదార్ధాలు దొరికినవి.

17 తేది వుదయాత్పూర్వము 3 గంటలకు లేచి యిక్కడికి 7 కోసుల దూరములో నుండే చత్తియా అనే వూరు 10 గంటలకు చేరినాను. దారి సడక్కువేసివున్నా వర్షము కురిసి యెండివున్నందున మనుష్యులను నడవనియ్యకుండా మట్టిగడ్డలు కాళ్ళకు నిండాగా గుచ్చుకుంటూ వచ్చినవి. యిక్కడి బోయీలను బేరాలని చెప్పవలెను. వారందరు గోపాలకజాతి అని తెలియవచ్చినది. మనదేశపు వుప్పాడ బోయీలు వారు మోశే దండే మీద చెయివేస్తే మాజాతి మణిగిపోయనని బహు రచ్చచెస్తారు, వీరు స్నానము మొదలయిన ఆచారముకలిగి బ్రాహ్మణులకు యిక్కడి దేవతలకున్ను వుదకము పాకానికి తెచ్చి యిచ్చి నిండా వుపచారము చేయును అర్హులుగా తుళసీమణి ధారణ చేసి మాంసభక్షణ వదిలి నియమముగా వుంటారు. యీవుత్కలదేశములో అమితమైన పొగచుట్టలు తాగుతారు గాని హుక్కాల ప్రసక్తిలేదు. నేడిదారి కుడిపక్క కనుపడుతూ వచ్చే కొందలకు అడివికిన్ని సమీపము గనుక పులుల భయముకద్దు. మేముదారివడుస్తూ వుం