పుట:Kasiyatracharitr020670mbp.pdf/334

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


పూర్వ మహంపూర్వ మని యెదురుగా వచ్చినారు. వారు వోఢ్రబ్రాహ్మలు, వుత్కలు లనిన్ని చెప్పుతారు. యిక్కడ శేరు 1 కి 20 రూపాయల యెత్తు, కలకత్తా శికారూపాయలకు చెన్నపట్టణపు రూపాయలకు నూటికి పది వ్యత్యాసము వున్నది. చెన్నపట్టణములో తగ్గిన దినుసని తెలియవలసినది. బంగాళా సీమలోనుండే బోయీలు యీరీతిన బళువు యెత్తలేని జన్ను మోతగాండ్లుగా వున్నారే, మన దేశానకువచ్చే బంగళా పల్లకీలు బహు బళువుగా వుంటున్నవే, వీటి నిమిత్తమే మని విచారించగా బంగాళాలొవుండే యింగిలీషుదొరల కేమి? హిందువులకేమి పాలకీలుయెక్కే షోకేలేదు. పని గడవడానకు కూలిపల్లకీలు అప్పటప్పటికి వుంచుకుంటారు. ఆకూలివల్ల కీలు తేలికగానె వుంచున్నవి. అక్కడ నెల పొడుగు పల్లకీలు మాత్రము చేసి వుంచివున్నవి. వాట్లను హిందూస్తాన్ చెన్నపట్టణము మొదలయిన దేశాంతరాలకు పంపించడానకు తయారయినట్టుగా తోచబడుచున్నది.

14 తేది వుదయాత్పూర్వము 4 గంటలకు లేచి యిక్కడికి 2 కోసుల దూరములో నుండే వైతరణీనదీతీరపు వూళ్ళయిన ఆకులాపదా, మూడియాపాడు అనే వూళ్ళు 11 గంటలకు చేరినాను. యీనది వర్షాలు కురిశినందున వడవలకుండా దాటడమయినది. యీ దినము నడిచినభూమి శుద్ధరేగడ, మన్ను వర్షము కురిశినందున అమితముగా కాళ్ళకు అంటుకుంచూ వచ్చినది.

యిక్కడికి జాజీపురమని పేరుకలిగిన నాభిగయ మూడుకోసుల దూరములోవున్నది. అక్కడ యీ వైతరణీ నదీతీరమందు దేహానంతరము జీవుడు వైతరణీనది దాటే కష్ణము పొందకుండా వుండేకొరకు వైతరణీ ప్రయుక్తముగా వొక గొదానముచేసి నాభి ఆకారముగా వుండే వొక కూపములో పిండప్రదానము చేయవలసినది. వుత్కల బ్ర్రాహ్మలు 140 యిండ్లవారు నాభి గయావళీలని పేరు వుంచుకొని యాచించి జీవనముచేస్తారు. వీరు మత్స్యభుక్కులు కామనిచెప్పినా గయామహాక్షేత్రములో గయావళీలకు బ్రాహ్మణార్ధము చెప్పినట్తు దక్షినదేశస్థులు వీరిని చెప్పడములేదు. ప్రత్యక్షముగా అన్నశ్రాద్ధము చేస్తే స్వదేశాస్థులు దొరికితే బ్రాహ్మణార్ధము చెప్పుతారు. లేని