పుట:Kasiyatracharitr020670mbp.pdf/336

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


డగా దారిలో వొక అంగడివద్దవుండే కుక్కను పులివచ్చి పట్టుకొనిపోయెనదని గాబరాగా వుండినది. యీ వూరిలో బజారు వీధి వొకటే కలిగివున్నది. దిగడానకు ఇండ్లు నిండా చిన్నవిగా కట్టివున్నవి. నపల్లకీలు నవుకర్లు వుండడానకు నడివీధిలో వొక గుడారము వేసి యిముడ్చుకొని దిగినాను. ధర్మశాలలు యిక ముందర లేవని విన్నాము. యీ వూళ్ళోను కావలసిన పదార్ధాలన్ని దొరికినవి. యీ వూళ్ళో యిద్దరు పోలీసుఠాణా బంట్రౌతులు ఠాణా వుంటారు. ఠాణా యిక్కడికి మూడుకోసుల దూరములో వున్నది.

నాతోకూడావచ్చిన మనుష్యులలో కొందరికి అకస్మాత్తుగా తాళకూడని కడుపునొప్పి తగిలి నూరుబొట్లు స్పిరిటులవండర్ ద్రావకము పోసియిస్తే కుదిరినది. కొంతమందికి నెత్తురుబంకపడుతూ వచ్చినంతలో లాడును ద్రావకము పదిబొట్లు చక్కెరలో పోసియిస్తే కుదిరినది. భేదులు అమితముగా అవుతూ వచ్చివారికి శుద్ధిచేసిన అభిని మందు పూటకు చిన్నదూకయెత్తు యిస్తూ వస్తే కుదిరినది. స్త్రీసంబంధమయిన మేహరోగముమాత్రము వొకమాత్రానికి సాధ్యమయ్యేదిలేదు. వొక కావిటివానికి అతి బలిష్టుడైనా సకృదావృత్తి ఒక స్త్రీ సంభోగము అయినంతలో మేహము మేహవ్రణముకూడా పుట్టి క్రమముగా పాదాలలో నొప్పిపుట్టి నడవ కూడకుండా కలిగి నా చేతనయినంత చికిత్స కలకత్తలో చేయించిన్ని కుదరక నా స్నేహితులవశముగా ఆ మనిషిని కలకత్తలో విడిచిపెట్టి వచ్చినాను.

ఈశ్వరుడు యింతరోగముము సకృదావృత్తిలో పురుషులకుయిచ్చే పాడి దేహధర్మముతొ స్త్రీలను పురుషాకర్షణ చేయుచు వచ్చే టట్టుగా వేడుకతో తిరుగుతూ వుండేటట్టు యెందుకు నియమించినాడో ఆకారణము అతనికే తెలియ వలసినది. అయితే నాకు తోచేది యేమంటే ఆరీతిగా స్త్రీలను వుంచడము వల్ల తన కటాక్షానకు పాత్రులు కాతగ్గ పురుషులకు అడివిలో చరింపుచు నుండే వ్యాఘ్రము మొదలయిన మృగాలను చూచితే యెట్లా భయపడి దూరస్థు లౌదురో తద్వత్తుగా అయ్యే నిమిత్తమని తోచినది. అయితే అతని మాయ దురత్యయము గనుక మోహాన్ని జయించలేకుండా వున్నాము.