పుట:Kasiyatracharitr020670mbp.pdf/329

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యిండ్లుకట్టిపెట్టివున్నారు. సమస్తమయిన పదార్ధాములు దొరికినవి. పోలీసు జమీందారుడువుండే కసుబావూరు నాపరవానా వొక మజిలి ముందు పంపిస్తూ రావడమువల్ల నేను దిగే ప్రతివూరున్ను అన్ని విధాలా సొంతమువలే కావడముమత్రమే కాకుండా దింగిన వూరిమష్యులు దిగిపొయ్యే వూరిదాకా కూడావచ్చిసాగనంపించి పోవుచున్నారు. యిటు నాకు జరగడమే కాకుండా యిక్కడ పోలియను ఖాయిదా ముసాఫరులువచ్చి దిగితే చౌకీపారా రాత్రిళ్ళు యిచ్చి వారిని వారి సామానునున్ను కాపాడి పంపించేటట్టుగా వుత్తర్వు అయివున్నది. అంగటివాండ్లు వచ్చిన మొసాఫరులను ప్రార్ధించి దిగేలాగుచేసి కావలసిన పదార్ధాలు యిచ్చి ఆదరింపుచున్నారు.

యీ దేశపువాడికె వొకసారి వండుకున్నకుండ రెఒడోసారికి పనికిరాదు గనుకనున్ను కుండలు నయముగకనున్ను ముసాఫరులు అందరు కుండలుకొని వండుకొని దిగిన తావులలో ఆకుండలు పగల కొట్టిపోతారు.దిగుడు మజిలోలో కుండ పెంకుల వల్ల అసహ్యము మాత్రము ఒకటి కలిగియున్నది. యిల్లుకట్టి అంగటివాండ్లు జలవసతికి కూడా పూరాగాచేసి యుంచుతారు. యీవూళ్ళోనుంచి రాణీ సరాయిదాకా సడక్కు లేనందుననున్ను సడక్కు తిన్నగా యీవూరి నుంచి మేదినిపూరునకు వేశియుండుటందుననున్ను నా రెండుబండ్లను మేదినివూరుకుండా రాణీసరాయికి రమ్మని సాగనంపించి యీవూళ్ళో యీరాత్రి వసించినాను.

7 తేదీ ఉదయాత్పూర్వము 3 1/2 గంటలకు లేచి యిక్కడికి యేడు కొసుల దూరములో వుండే భద్రకాళి అనే వూరు 12 గంటలకు ప్రవేశించినాను. దారి సడక్కులేదు. పొలములమీద నడిచి రావలసినది. ప్రతిదినమున్ను నేను బయలుదేరిన దినము మొదలుగా కలకత్తాలో కలిగియున్న గ్రీష్మము లేకుండా తెల్లవారి మబ్బువేసి మజిలీ దిగినవెనక వర్షము కురియుచూ వచ్చినది. గనుక దారి బహు అడుసుగావుండినది. యీవూరున్ను గొప్పదేను. భద్రకాళి అనే దేవి గుడివున్నది. దిగడమునకు విశాలమయిన యిండ్లుకట్టి వసతికి గుంటలు తొవ్వించి యున్నారు. మొసాఫరులు దిగడానకు ఈ అంగడివాండ్లు,