పుట:Kasiyatracharitr020670mbp.pdf/328

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వర్షారంభము గనుక యీ రాత్రి నిండా వర్షముకురిసినది. యీ రాత్రి యిక్కడ వసించినాను.

4 తేది వుదయాన 6 గంటలకు లేచి యిక్కడికి నాలుగు కోసుల దూరములోవుండే బాగునా అనే వూరు 9 గంటలకు ప్రవేశించినాను. దారి సడక్కువేశియున్నది. నామోదరు అనేనది పడవలతో దాటినాను. కాశినుంచి పది బాడిగె గుఱ్ఱాల మీద 40 బిందెల గంగ చెన్నపట్టణమునకు పంపించినది గాక కూడా వున్న గంగాజలము యెనిమిది బిందెలున్ను నిత్యము జరూరులేని డేరాలు రెండున్ను మందుల పెట్టెలు వగైరా సామానున్ను రెండుబండ్లమీద తెచ్చినందున యీనదులు పడవలకుండా దాటేటప్పుడు, బహుప్రయాస యిచ్చినవి. యీవూరుగొప్పదేను. బాజారుకద్దు. సకల పదార్ధాలున్ను దొరుకును. భాటసారులు దిగడానకు గొప్ప యిండ్లు, అంగడివాండ్లు కట్టివుంచి వుండేటందున డేరాలు నిమిత్తము లేకుండా విశాలమైన అంగడి యింట్లో దిగినాను.

5 తేది వుదయాత్పూర్వము మూడుగంటలకు లేచి యిక్కడికి అయిదు కోసుల దూరములో వుండే సీదహాటు అనేవూరు పదిగంటలకు చేరినాము. దారి నిన్నటివలెనే సడక్కు వేశి వారధులు కట్టి వున్నది. రుక్మినారాయణ న్ అనే నది వొకటి యీదినము పడవకుండా దాటినాము. యీవూరు గొప్పది. బాజారున్నది. దిగడానకు యిండ్లు సహా కట్టివున్నారు గనుక డేరాలు వెయ్యలేదు. దిగినయింటికి నాలుగణాలు యిస్తే అంగటివాడు సామాను తీయవలసినది గనుక అదే ప్రకారము చేసినాను. సమస్తమైన పదార్ధాలు ఈ వూళ్ళో సహజముగా దొరికినవి. యీవూళ్ళో ఈ రాత్రి వసించినాను.

6 తేది వుదయాత్పూర్యము మూడుగంటలకు లేచి యిక్కడికి యేడు కోసుల దూరములో నుండే డబరా వూరు 10 గంటలకు చేరినాను. దారి సడక్కువేసి ముందుదినముల దారివలెనే యిరుపక్కలా పైరుపొలాలుకలిగి సుందరముగా వున్నది. దోవలోవుండే క్రసా అనేనది కాలునడకగా దాటినాను. యీవూరుగొప్పదేను. అంగటివాండ్లు గొప్ప