పుట:Kasiyatracharitr020670mbp.pdf/330

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అంగడికి చేరినట్టు ప్రత్యేకముగా కట్టితివుంచే యిండ్లు విడవలిపూరికలవి అయినా బహు రమణీయముగా ప్రతిదినమున్ను శుద్ధిచేసి వుంచుతారు. యిక్కడ సమస్తమైన పదార్ధములు దొరికినవి.

2 వ తేది వుదయాత్పూర్వము 4 గంటలకు లేచి యిక్కడికి యెనిమిదికోసుల దూరములోనుండే రాణీసరాయి ప్రవేశించినాను. ఈజగాలో వూరులేదు. 30 అంగళ్ళు సడక్కుకు యిరుపక్కలా కట్తివున్నవి. దిగడానకు విశాలమయిన యిండ్లుకట్తి వాటికి చేరినట్టుగానే రమణీయమైన గుండతొవ్వించినారు. చౌకీదారులు మాత్రము వున్నారు గాని పోలీసు బంట్రౌతులు యిచ్చట వుందడములేదు. దారిలో నారాయణగడయని వొకవూరు వున్నది. అక్కడ పూర్వరాజులు నియమముచేసిన చదావృత్తి సత్రాన్ని అద్యాపి కుంఫిణీవారు నడిపిస్తూవున్నారు. యిక్కడ సకల పదార్ధములు కూరగాయల సమేతముగా దొరికినవి. ఈదేశములో పాలు పెరుగు సహజముగా దొరుకుచున్నవి. దిగిన మజిలీలలోవుండే చౌకీదారులు నలుగురేశిమందిని రాత్రిళ్ళు నాబంట్రౌతులతో కూడా పారాయిచ్చేటట్టు చేసి వుదయాన సాగివచ్చేటప్పుడు నాలుగేశిఅణాలు యిస్తూ వచ్చుచున్నాను. యీ దినము దారి కొంతమేర సడక్కువేశి యున్నది.

6 తేది ఉదయాత్పూర్వము 2 1/2 గంటలకు లేచి యిక్కడికి 9 కోసుల దూరములో నుండే జేలేశ్వరం పట్టణం అనే వూరు 1.3 గంటలకు ప్రవేశించినాను. దారిసడక్కుచేసి వారధులు కట్టివున్నది. యిరుపక్కలావుండే భూమికన్నా మనిషి పొడుగుమిట్టతో సడక్కువేసియున్నారు. సడక్కునిమిత్తమై కాలువగా మట్టి యెత్తినారు గనుక ఆ కాలువలో నీళ్ళు నిచిచినప్పుడు వొంటికొయ్య దోనలమీద కావలసిన సామానులు వుంచి యీడ్చుకొని వస్తూవుంటారు. ఈ వూరు సువర్ణ అనే నదీతీరము. గొప్పవూరు. బాజారువీధి వున్నది. ముసాఫరులు దిగడానకు యిండ్లు సమేతముగా యేర్పడివున్నవి. సమస్తమయిన పదార్ధాలు దొరికినవి.

10 తేది వుదయాత్పూర్వము 3 1/2 గంటలకు లేచి యిక్కడికి అయిదుకోసుల దూరములో నుండే బస్తా అనే వూరు 10 గంటలకు