పుట:Kasiyatracharitr020670mbp.pdf/325

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


బస్తి ఆపేక్షయా కలకత్తాను చెన్నపట్టణమునకు రెట్టింపు షహరని చెప్పవచ్చును. యింకా హిందూస్తాన్ లో జమీందారులు రాజులు నిస్సారులు కాక వుండేటందున యిక్కడ వర్తకము అమోఘముగా జరుగుచున్నది.

యేప్రల్ మే నలలు రెండున్నూ యిక్కడ మిక్కటమైన గ్రీష్మ కాలము గనుక ప్రతీ ఇంట్లోను ప్రతికొట్టిడికిన్ని పంకాలు వేశివున్నవి. యీ కాలములో ఆ పంకాలగాలివల్ల యిక్కడివారు జీవిస్తారు గాని అన్యధా కాదని తొచినది.

యీ ప్రదేశాలభూమి నివాసులున్ను పశువులున్ను బలిష్టములు కాకపోయినప్పటికిన్ని భూమి పచ్చికమాత్రము బాగాపట్టి వున్నది. అయితే పచ్చిక పొడుగు పెరగలేదు. యీకలకతాలో యింగిలీషువారు వారి శీమలోని పిచ్చన్సునే పండ్లున్ను రెండుదినుసులు పయిరువేశినారు. లిచ్చన్సుపండ్లు బెత్తపు పండ్లు జాడగా పులుసుతో తీపుకలిసి వుంచున్నవి. సిచ్చన్సు అనే పండు బాదంకాయలవంటి విత్తులు లోపల కలిగి పులుసుమీరిన రుచితో వుంచున్నది. యీ షహరు హిందువులు జంబునేరేడుపండ్లను పూజ్యతగా వాడుతారు. పచ్చిద్రాక్షపండ్లు అరుదు. హిందువులందరు అటాటాకులు వేసుకోవడమేగాని యితరమయిన ఆకులు తాకడములేదు. అన్నిచెట్లు వీర్యముగానే పెరిగివున్నవి. గీష్మకాలపు రెండు నెలలనున్ను యీదేశస్థులు తుపాను కాలమంటారు. యిక్కడ హుక్కాలు తాగనివారులేరు. గుడాకుచేసే గిడ్డంగీలకు బొగ్గువుంటలుచేసే గిడ్డంగీలు శానా కలవు, గుడాకువుండలు ప్రతి అంగడిలోను వుంచి అమ్ముతారు. తమల పాకులు బహుదళముగానున్ను పెద్దవిగానున్నుమిక్కిలి లావు పొడుగైన కాడలు కలవిగా నున్ను తెచ్చి సాధారణముగా అమ్ముతారు. యీదేశస్థులు తాంబూల చర్వణము చేయడము విస్తారముగానే వున్నది.

యీ షహరులో ఒక వేగినాటి బ్రాహ్మణుడు విశ్వనాధభొట్లనే వాడు ముప్ఫై యేండ్లుగా సంసారములో దక్షిణ దేశపు బ్రాహ్మణులకు యధాశక్తి సహాయము చేయుచూ కాపురమున్నాడు. సంపాదనార్ధము అగంతుకులుగా పంచద్రావిళ్ళతో చేరిన బ్రాహ్మలు