పుట:Kasiyatracharitr020670mbp.pdf/324

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గొప్పయిండ్లు యీ వరకు నేను చూచినది లేదు. హయిదరాబాదులో మాత్రము రిసైడెంటు వుండే యిల్లు యీ యిండ్లకు ముకాలువాసి గొప్పగా చెప్పవచ్చును. యిక్కడి గౌరన్ మెంటు యిండ్లు మూడు అంతస్థులు భాగీరధీ నది వెంబడిగా శాలవేశి కష్టమాఫీసు మొదలైన కచ్చేరీలు అన్ని కట్టివున్నారు. కలకత్తా కోటచుట్టూవుండే బయిలు శాలలు చూస్తే చెన్నపట్టణము చూచి తయారు చేసినట్టు తోచు చున్నది.

కలకత్తాకు వుత్తరము చిత్తుపూరు అని వొక బస్తీవున్నది. దక్షినము మచ్చిగోల అనిన్ని గార్డన్ రీచ్చి అనిన్ని ద్వినామము కలిగిన బస్తీ వొకటి వున్నది. ఆ బస్తీలో తోటలు మెద్దెలు గంగాతీరమందు వుండుటచేత సూప్రీం కోరటు జడ్జీలు మొదలయిన గొప్పవారంతా అక్కడనే వున్నారు. ఆ ప్రదేశము వసతి అవుటచేత నేను వున్న దినాలకు నెల 1 కి 120 రూపాయీల వంతున ఒక తోటమిద్దె బాడిగకు తీసుకొని వున్నాను. పడమటిపక్క చోరంగ అనిన్ని, కిదరుపూరనిన్ని, లాలుడిగ్గీ అనినిన్ని మూడు బస్తీలు వున్నవి. యిక్కడ సమస్త జాతివారు రెండు మూడు అంతస్థులుకల గొప్ప మెద్దెలు కట్టుకొని కాపురమున్నారు. అయితే ఆ మెద్దెలకు చుట్టూ తోటలు లేవు. చిత్తుపూరు నుంచి కిదరపూరికి వచ్చే శాలలో వస్తే చెన్నపట్టణపు పాపంసు బ్రాడివే అనే వీధిలో వచ్చినట్టు యిరుపక్కలా షాపులు కలిగివున్నవి.

కలకత్తా షహరులో పోలైను వారు నెంబరు వేశిన వోఢ్రబోయీలు మోశేకూలి పల్లకీలు 1000 కె సరిగా వుంచున్నవి. వోఢ్రబోయీలు యిరువురు మోయడమేగాని ముప్పిరియెంత బళువైనా వేయరు. నడుముకు వొకబట్ట చుట్తుకుని చేతమొగిలాకు గొడుగు పట్టుకుని చింపిరితలతో మోయుచు నుంటారు. కరాచీలు అనేబండ్లు యింగిలీషు చారయాట్ బండ్లకు నకలుగాచేసి, రెండుతట్టువాణి గుఱ్ఱములు కట్టి చెన్నపట్టణపు గూడుబండ్లకు బదులుగా వీధికి నాలుగైదు బాడిగకు పెట్టుకొని వున్నారు. కలకత్తా షహరు అలంకారము జాతి వాండ్ల యిండ్లవద్దనున్ను శీమవాడలు నిండియుండే గంగాతీరపు శాల లోనేగాని హిందువుల యిండ్ల వద్దికిపోతే సామాన్యపు స్త్రీలకు రాజును చూచిన కండ్లతో మొగుణ్ణి చూచినట్టు వుంచున్నది. జాతులవాండ్ల