పుట:Kasiyatracharitr020670mbp.pdf/323

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముగా వుండే సముద్రోదకము గంగా సంగమమయ్యే భాగీరధిలో వూరాగా లోచొచ్చేటట్టు యీశ్వర నియమనమయువున్నది. గనుక ఆ భాగీరధి కుండా యుద్ధపువాడలు హుగ్గులీ ప్రవేశించి ప్రాంసువారు వాసము చేయను కట్టుకొనివుండే కోటను వూరినిన్ని తీసుకునియింతలో మక్కుషూబాబాదుపై యుద్ధముచేసి వాన్ని స్వాధీనముచేసుకొని *కుమ్మక్కు చేసిన హస్తాంతరమయినవానికి అప్పట్లో ఢిల్లీపాధుషా దొరతనము ఆరాజకమై వుండగా అందులో పట్టాభిషేకము చేసి ఇంగిలీషువారిలో అప్పటికి యుద్ధప్రసక్తికి నిలిచిన దొరలు కావలసినంత ధనము కొత్త ప్రభువువల్ల పుచ్చుకొన్నారు. అదిమొదలుగా కలకత్తా కోటయున్ను వూరున్ను బస్తీ అయినది.

యింగిలీషు జాతివారు యీశ్వర కటాక్షమునకు పాత్రులయ్యే కొరకు వాక్యమందు ప్రయాణికులై నందున వర్తకులు ధనికులున్ను అనేక హింసలుగల చుట్టుపక్కల రాజ్యములు వదిలి కలకత్తా బ్నస్తీ ప్రవెశించినారు. యిప్పటికి కోట్యంతాధారులుగా వుండే హిందువులు కలకత్తాలో పదిమంది అయిదుమంది వున్నారు. యిరువై ముప్పై లక్షలు కలవారు నూటికి యిన్నూటిటికిదాకా వున్నారు. యీకలకత్తా బస్తీ యీ చొప్పున నవీనమైనందున గొప్పవారి యిండ్లన్ని యింగిలీషు తరహాగా కట్టివున్నవి. వొక మాత్రపువారి యుండ్లు యెంతమాత్రము బాగులేక యింగిలీషు డౌలుతో హిందూతరహాకూడా కలిసి వొక వికారమగా కట్తివున్నవి. కలకత్తాలో కోటచుట్టూ యైస్ల్చ్దానేడు అనే కొంత బయలు విడిచి అవతల యింగిలీషువారు రెండు మిద్దెలకు తక్కువ లేకుండా అయిదు అంతస్థులకు ఎక్కువలేకనున్ను గొప్పయిండ్లు అనేకముగా కట్టివున్నారు. యిక్కడికి జాతూలవాండ్లు చెప్పడ మేమంటే కలకత్తా యిండ్లు రాజునగళ్ళు అనిన్ని, చెన్నపట్టణపు ఇండ్లు బంగాళాలు అనిన్ని ప్రతిష్టగా చెప్పుకుంటారు. కలకత్తా గౌర్నమెంటు యిండ్లంత


  • మూర్షిదాబాదు నవాబు సురాజుద్దౌలా క్రింది యుద్యోగి మీర్జాఫరు స్వామిద్రోహముచేసి యింగ్లీషువారితో చేరగా 1757 లో ఇంగ్లీషువారు ప్లాసీయుద్ధము గెలిచి మీర్జాఫరును నవాబు జేసిరి.