పుట:Kasiyatracharitr020670mbp.pdf/317

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేస్తూవస్తరు. లంగరులు లేకనే యీ వరకు నావాలను తాళ్ళతో గట్టున మేకులు పాతి దిగగానే బేపర్వాగా కట్తుతూ వచ్చినట్తు నద్యామొదలు రావడము లేదు. పోటుకు మనిషి పొడుగుకు అధికముగా నీళ్ళువచ్చి పాటుకు తీశిపోతూ వస్తున్నవి. యీ పోటు పాటు కాలములో కలకత్తకు పోవలసినవారు పాటులోను, అక్కడనుంచి వచ్చే వారు పోటులోను నవాలను నడిపిస్తూ వస్తారు.

3 తేది హుగ్గులీ అనే కసుబా బస్తీ చేరినాను. యిక్క్డ కలకటరు వగైరా అధికారస్థులున్నూ, శొంతదండున్ను వున్నది. యీ హుగ్గులీలో సుందరమైన యిండ్లు జాతులవారు గంగాతీరమునందు శానాగా కట్తివున్నారు.

4 తేదీ బారకుపూరు అని జాతులవాండలవల్ల చెప్పబడుతూ నల్లవాండ్లవల్ల ఆ చానక్కు అని చెప్పబడుతూ వుండే ద్వినామధేయము గల వూరు చేరినాను. ఈ బ్నస్తీవూరు కలకత్తతోచేరి కలకత్తను అందుకొని వున్నది. యీ బస్తీలో గౌరన్ మెంటు వారిది వొక గొప్ప యిల్లు తోట బహుసుందరముగా కట్టించబ్నడివున్నది. యిక్కడ కొంత దండుకూడావున్నది. యీ బస్తీ కలకత్తకు సమీపముగా 3 కోసుల దూరములో వున్నది గనుకనున్ను, విశ్రాంతి ప్రదేశాముగనుక నున్ను యిక్కడ అనేకులు సౌఖ్యార్ధముగా మంచితోటలు, యిండ్లు బంగాళాలు కట్టించివున్నారు. అందులో గ్రీష్మకాలములో కలకత్తా నివాసులైన గొప్ప దొరలు వచ్చి వాసము చేస్తూ వుంటారు.

యీ వూరికి యెదురుగా నదికి అవతలపక్కను శ్రీరాంపూరు అనే వొక వొలందావారి కసుబాబస్తీ గ్రామము అనేకమయిన గొప్ప మిద్దెలు కలిగివున్నది. హుగ్గుళిమొదలుగా ఆచానక్కువరకు నదికి యిరుపక్కలా యిండ్లు, తోటలు, మిద్దెలు అసంఖ్యముగా కట్తివున్నవి. అందులో కొన్ని బస్రీలు ఫ్రాంసువారివిగానున్ను కొన్ని డెన్మారు కు వారివిగా నున్ను, కొన్ని డచ్చివారివిగానున్ను ఆద్యాపి ఆ యా జాతి వాండ్ల యేలుపాటులో వున్నవి గనుక నొచ్చి పొయిన బంగాళాదేశస్థులు యింగ్లీషువారిన్యాయ ప్రకారము అప్పులవారి నిమిత్తము కలిగే రాజదండనవల్ల తప్పించుకొనే కొరకు చెన్నపట్టణమువద్ద పులిచేరికి వంజి