పుట:Kasiyatracharitr020670mbp.pdf/318

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నది. మాయాశాక్తి దుష్ట నిగ్రహార్ధము మహాకాయము ధరించి దుష్ట నిగ్రహము అయిన వెనుక తన మహాకాయము తనకు అసహ్యముగా తోచినంతలో తన చైతన్యాన్ని సౌమ్యకాయము సృష్టించుకొని అందులో ప్రవేశపెట్టి లోగడి మహాకాయమును వదిలి నంతలో మహాశక్తి నాధుడైన సాంబమూర్తి ఆ మహాకాయ మోహితుడై ఆ మహాకాయమును చంకపెట్తుకొని పరవశుడై దేశాటనము చెస్తూ వచ్చినట్తున్ను లోకశిక్షకులలో వొకడయిన అతను పరవశుడైవుండుటచేత లోకమునకు క్షేమవిరోధ మయినట్టున్ను లోకరక్షకుడయిన విష్ణువు లోకముయొక్క క్షేమముకొరకు చక్రాయుధధరుడై, అటుతిరుగుతూ వున్న సాంబమూర్తిని వెంబడించి అతని చంకనుండే కళేబరమును చక్రాయుధముతో తునకలుగా కత్తిరించుతూ వచ్చినట్టున్ను అవి భూమిలో రాలుచు వచ్చినట్తున్ను అటుక త్తిరించిన తునకలలో యీ కలకత్తాలో ఆ మహాకళేబరము యొక్క చేతివ్రేలు పడ్డట్టున్ను యిక్కడికి వుత్తర దేశమందుండే కామరూప దేశములొ యోనిపడ్డట్టున్ను యింకా యితర ప్రదేశములలో అనేక అవయవాలు పడ్డట్టున్ను అటు అవయవాలుపడ్డ ప్రదేశములంతా శక్తి ప్రత్యక్షకరములై ఆరాధించిన వారికి అబీష్టసిద్ధులు చేస్తూ వచ్చేటట్టున్ను యిక్కడి స్థలపురాణ మహిమ గనుక యీ కలకత్తా షహరుకు మూడుకోసుల దూరములో దక్షిణభాగమందు ఒక కాళీ గుడి వున్నది.

ఆ గుడి దక్షిణదేశమువలెనే నిండా సుందరముగా కట్టివుండక పోయి నప్పటికిన్ని విశాలమైన గర్భగృహము ముఖమంటపము కలిగి వున్నది. ఆ గుడిసమీపముగానే గంగవాగు వకటి పారుతూవున్నది. ప్రతిదినము ఆ శక్తిని యీ దేశపు బ్ర్రాహ్మణపండ్యాలు పూజ చేయుచు వుంటారు. మేకలను, మేకపిల్లలను లోకులు ప్రతిదినము తెచ్చి బలులు యిచ్చి పోతారు. శుక్రవారము, ఆదివారము విశేషబలులు పూజలు జరుగుతున్నవి. నవరాత్రిళ్ళలో యిక్కడ మహోత్సవమును జరిగించి యీ దేశములో మహిషములు లేకపోయినా దేశాంతరాలలొ నుంచి అనెకములుగా తెప్పించి