పుట:Kasiyatracharitr020670mbp.pdf/309

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అనే నామాన్ని శైవపరముగా అర్ధముచేయును మిక్కిలి హింసపడ్డట్టున్ను ఆత్మ - అంతరాత్మ - పరమాత్మ - అనే వాచకములు పురుషపరముగా వున్నదని శాక్తులు స్త్రీపరముగా నామాంతరాలు వుంచినారు.

ప్రకృతి దేహములలో కొందరిని దేవతలుగానున్ను కొందరిని రాక్షసులుగానున్ను కొందరిని మనుష్యు మొదలయిన వారుగానున్ను భేదము కలగఛెసి అటువంటి తెగలలొను ప్రతి తెగకు అనేక ప్రకృతి భేదములుగా పరాత్పర వస్తువు సంకల్పము చేయవలసిన దేమని విచారించగా సృష్టి సంకల్పము అబాజ్మానస గోచరమైన వస్తువుకు పుట్టడము చిద్విలసాల్ర్థము గనుక సృష్టిని అంఖండమున్ను, యేకాకారమున్ను చేస్తే రసము పుట్టదు. అందుకు దృష్టాంత మేమంటే మనుష్యులు తమ నకలుగా విలాసార్ధమై వొక మేళము జతపరచి నత్రనము చేయించి వేడుక చూచేటప్పుడు అందరున్ను వొక్కతాళము నేవాయించితే రనముగా వుండ దని, ఆడేటట్టుగా వొకరిని నియమించి, సుతి8పట్టడానకు ప్రత్యేకముగా వుండేటట్టుచేసి మళ్ళీ అందరిని వొక తావులో చేర్చి వొకనికి వొకణ్ని పైపోటీచేసి తన్నే 'శాబాను ' అన వలెనని ప్రతిపురుషుడు తనకు నీమకమయిన వాద్యాన్ని శ్రావ్యముగా వాయింపుచునుంటే యెట్లా మనమువారి యితరేతర ధిక్కరాలను పరస్పరానుకూలతనున్ను చూచి ఆనందిసారేమో తద్వత్తుగా సరోత్తమమయిన వస్తువు యీదేహములనున్ను వాటిలోని ప్రకృతులనున్ను భిన్నములుచేసి వారి మనస్సు వాక్కు- కాయములు - కర్మములద్వారా వారు చేసే చేష్టలను చూచి ఆనందింపుచున్నది.

సప్తగ్రహముల పేళ్ళతోవుండే బృహస్పతి, శుక్రుడు మొదలయిన వారిని సప్తబ్రహ్మాండములనే చెప్పవలని. ఆపేళ్ళు గలవారు బ్రహ్మాండ స్వరూపులయితే యీ బ్రహ్మాండానికి వచ్చి శృతులకు వ్యాఖ్యానమయిన స్మృత్లుచేసి యీ బ్రహ్మాండము వదలి దేవతలు, తోరాక్షసులు మనుష్యులతోను వారు సహవాసము యేట్లా చేసినారని యోచించి విచారించగా పరమాత్మ జ్యోతిర్భూత మయిన సూర్యుణ్ని