పుట:Kasiyatracharitr020670mbp.pdf/310

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రూపములయిన జ్యోతిస్వరూపలు గాక రాత్రిళ్ళు భూపతన మవు తూవుండే కొన్ని తేజస్సమూహాలు నక్షత్రాలుగా తోచబడుచున్నవి. అవి భూమిని అగుపడే మిణుగురులవలెనే భేచరమార్గముతో వుండే మిణుగురులు గాని నక్షత్రములు గావు గనుక నున్ను ఆ మిణుగురులు బృహత్తులు గనుకనున్ను అవి అధోభాగమునందు పడేటప్పుడు ఆ బృహత్తులయిన మిణుగురులు నక్షత్రములవలెనే మనకు అగుపడుచూ వుండుటచేత మిరియాలలో నుండే నల్లరాళ్ళను వాటి యేకరాశి గతివల్ల వాటి సమూహదర్శన మైనప్పుడు రాళ్ళను మిరియాలనుకున్నట్టు ఆ బృహత్తులైన మిణుగురులను నక్షత్రములని భ్రమ పడవలసియున్నది.

యిటువంటి అనేకకోటి బ్రహ్మాండములలో కొన్ని బ్రహ్మండములయిన బృహస్పతి మొదలయినవారు తృటికాలముకూడా జ్యోతిర్భూతమునకు చేసే ప్రదక్షిణము భంగము కాకుండా తిరగవలసిన వారై వుండగా వారు యీ బ్రహ్మాండమునకు పురుషాకృతితో వచ్చీయిక్కడి పిండాండాము లయిన మనకు స్మృతులు చేసి యిచ్చి హెతవు యెట్లా ఛేయగలుగుదురు! గనుక, వాటి వాస్తవము యేమంటే భృగు బృహస్పతి మొదలైన వారు మన ఆపేక్షయా దేవతలు గనుకనున్ను స్వేచ్చావిహారులై మన స్వూర్యుణ్ని ఆశ్రయించి వుండే కొన్ని బ్రంహ్మాండములకు వెళ్ళుతూ వాటిలొ విస్తారముగా వసింపుచున్నందున నవాబు వసించే పెటను నవాబుపేట అని గుర్తు నిమిత్తము నవాబు పురస్సరముగా పేటను తెలియ చేసినట్టు బృహస్పతి మొదలైన వారి గమనాగమనములు పట్టి జ్యోతిశ్శాస్త్రములో గ్రహగతులు గణిత మూలకముగా నిర్ణయించబడమునకు గాను యీ మహా పురుషుల పేళ్ళనే ఆ బ్రంహాండములకు సంకేత వాచకములైన పేళ్ళుగా విర్ణయించి యుండవలె నని తొచుదున్నది.

నేను యెనిమిదో లంజం భాగలోవుండే కన్యాముమారి మొదలుగా యిరువైయారో భాగలో నుండే కాశీపట్టణమువరకు దేశాటనము చేయడములో అహ:ప్రమాణములు దేశదేశానకున్ను భేదింపుచు వచ్చుచున్నది. యీ ప్రకారము అహ:ప్రమాణములు దేశ