పుట:Kasiyatracharitr020670mbp.pdf/308

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


వాచకము లేల పుట్టినవి? వేటికి ఆ వాచకములు వాస్తవమూఅ వుపయుక్తము అని విచారించగా పరమాత్ముడు సృష్టినిమిత్తముగా వటబీజములో వటవృక్షము అణిగి వున్నట్టు ఆకాశభూత స్వరూపముతో సమస్తములో అణిగినాడు గనుక, అట్లా అణిగిన వస్తువులన్ని బీజాలు అనిపించు కున్నవి గనుక వాటిని నపుంసక లింగా లని చెప్పవలసినది. అటువంటి బీజములను తానే ధరించి అంకురోత్పత్తి చేసే నిమిత్తము గర్భములో వుంచతగిన దేహముల నంతా పుల్లింగములుగా చెప్పవలసినది. అటు చేయబడే బీజప్రదానాలను భక్తి శ్రద్ధలతో ప్రతిగ్రహించి గర్భములో భద్రపరచి అంకురోత్పత్తి పూర్తి కాగానే మహా స్త్రీలింగభూతముగావుండే పృధ్వియొక్క అధీనము చేయుచు వుండే దేహాములంతా స్త్రీలింగములుగా చెప్పవలసినది. యీ లింగత్రయము పైన వ్రాసిన దేహములను విభజనచేసి వ్యహరించను జన్యమైనది గనుకనున్ను నపుంసక లింగవాచక యోగ్యమైన బీజాలు అదృశ్యాలు గనుక స్త్రీలింగ పుల్లింగ వాచకములు ఆకాశ మహాభూతము వాయుమహాభూతమువల్ల చేయబడ్డ సృష్టికోటికే వుపయోగములు గాని మిగిలిన భూతత్రయముయొక్క సృష్టికోటిమి లింగవిభజన లేదు గనుక వుపయోము లేదు. అయితే మానుషకోటి తమయొక్క సమయ సంకేతాలనే శాస్త్రములద్వారా అటువంతి సృష్ట్యంతరములగుండా స్త్రీలింగ పూర్వకమయిన నామధేయములు వుంచి వాడుకొనుచున్నారు.

పయిన వ్రాసిన ప్రకారము లింగవాచకములు వుత్పత్తి అవుట చేతనే శాక్తమతస్థులు "సర్వం శక్తిమయం జగత్" అని చెప్పేమాటము బంకరముగా ఆత్మ - అంతరాత్మ - పరమాత్మ యీ ముగ్గురికిన్ని ఇచ్చా శక్తి - జ్ఞాపకశక్తి - పరాశక్తి అని నామాంతరాలు వుంచినారు. యీ మూడువస్తువులు వాస్తవమూఅ స్త్రీలింగవాచకములున్ను పుల్లింగవాచకములున్ను కాక శుద్ధ నపుంసక లింగవాచకాలు అయివుండినా రామ అనేశబ్రములో రుద్ర సంబంధముగా వుండే అక్ష్రరము వున్నదని దశరధనందను డని చక్రవర్తి తిరుమర్హి అని రాముడికి వైష్ణవులు పేరుపెట్టి నట్తున్ను, శైవు డయిన అప్పయదీక్షితులు వగయిరాలు నారాయణ