పుట:Kasiyatracharitr020670mbp.pdf/279

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మధుస్రవ అనే స్థలములోనున్ను, గయాశిరసి అనే తెర్ధములోనున్ను కూపగయ అనే బావివద్దనున్న, మృడవృష్ఠం అనే స్థలములోనున్ను, భీమగయ అనే స్థలములోనున్ను, గోష్పదం అనే స్థలములోనున్ను, వైతరణి అనే స్థలములోనున్ను అంతు పదిస్థలములలో ప్రత్యేక ప్రత్యేకముగా పిండప్రదానములు చేయవలసినది. యిది అష్టగయాశ్రాద్ధముటొ చేరిందికాదు. యివి అన్ని ఉపతీర్ధములు. ఇటువంటివి సహస్రావధి తీర్ధములు వున్నవి. వాట్లలో నంతా చేయడానికి మనుష్యులకు ప్రయాస అని గదాధరరూపముగా గయావళి అక్షయవట శ్రాద్ధము నాడు సుఫలము యియ్యడము గనుఇక గయావళీలలో ప్రముఖముగా వుండే వారంతా నాయెడల జడ్జీ మొదలయిన దొరలు ప్రీతిగా వుండేది చూచి మీరు అందరింవలెనే అష్టతీర్ధములు చేయనక్కర లేదు. రామసాగర మనే గొప్ప తీర్ధము ఒకటి దొరలు ఆక్రమించుకొని సంకిళ్ళవాండ్లుగుండా మరామత్తు చేయింపు చున్నారు. ఆ తీర్ధము క్షేత్రానికి మధ్యే వున్నది. ఆ తీర్ధము దొరల అధీన మయిపోతే మాకండ్లు తీసివేసినట్టు అవుల్చున్నది. ఆ తీర్ధమువద్ద యెవరినిన్ని పిండప్రదానాలు చేయనివ్వడములేదు. మీరు దొరలవద్ద సెలవు తీసుకొని ఆ రామసాగర తీర్ధము వద్ద పిండప్రదానము చేసినట్టయితే అన్ని ఉపతీర్ధములలో పిండప్రదానము చేసిన దాని కన్న యెక్కువ ఫలము సిద్ధింపుచున్నదని చెప్పుకొన్నందు చేతనున్ను, నామనివి దొరల వద్ద అప్పట్లో సాగేటట్టుగా ఈశ్వరుడు కటాక్షించి వున్నందున మారీసు దొరగారితో మనివి చేసినంతతో వారు మేజట్రేటు జాంసన్ దొర గారితో యోచించి ఆ తీర్ధము వద్ద హిందువులు పిండప్రదానములు చేయడము ఫలాని ప్రదేశమని నిశ్చయించి అక్కడ నున్ను పిండప్రదానము చేశేటట్టు వుత్తర్వు చేశినారు. గనుక అన్ని ఉపరీర్ధాలకు బదులుగా గయావళీల సమూహము అప్పట్లో అక్కడ కూడినది గనుక వారి సన్నిధిని ఆ రామసాగరములొ పిండప్రదానము చేసినాను. ఆ మరుసటి దినమే మరి ఒక గొప్పవాడు యీ దేశస్థుడు

-