పుట:Kasiyatracharitr020670mbp.pdf/278

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


తున్నారు. వీండ్లుపెట్టే నిర్బంధము అంతా యీవటశ్రాద్ధమునాడు, అనుఫలము యిచ్చే కాలమందు గాని మరి యెప్పుడు నోటిమాట మాట్లాడరు. పూర్వకాలమందు యీసుఫలము యివ్వకుండా లోకులకు శానా శ్రమపెట్టుతూ వచ్చినారట. యిప్పుడు తుదను నాలుగు రూపాయిలు యిచ్చినా పుచ్చుకుంటున్నారు. ముఖ్యమయిన యీ అష్టగయ చేయడానకు సకల శలవులతో కూడా అరువై రూపాయలు పట్టుచున్నవి. యీసుఫల పుచ్చుకొని అక్కడ సమీపములో వుండే గుళ్ళో ప్రసితామహేశ్వర దర్శనము చేసుకొని శ్రార్ధశేషము భోజనము చేసుకొని వారి వారి పరువుకొద్ది విభవములతోనున్ను, మేళతాళములతోనున్ను వచ్చి విష్ణుపాదగదాధర దర్శనము చేసుకొని యింటికి రావలసశినది.

యీ అక్షయవటము వద్ద ధర్కశాలలో గయావళులు తప్ప యితరులు భోజనము చేయకూడదని ఒకకట్టు కట్టుకొని శ్రాద్ధశేషము కర్తను తప్ప మరి ఒకరిని అక్కడ భోజనము చేయనీయకుండా అంధపరంపరగా యీవరకు జరుగుతూ వచ్చినది. యీశ్వర కటాక్షముచేత నేను గయా మహాక్షేతములో వుండేవరకు అన్నసత్రాలు లేనందున పంచద్రావిళ్ళు అయిన మన దేశస్థులు 30 కి తక్కువ లేక నిత్యము నాతో సహపంక్తిగా భోజనము చేయుచూ వచ్చిరి గనుక వారు అందరు నామండలితో కూడా ఆ ధర్మశలలో పిండప్రదానానంతరము భోజనము చేశేటట్టు ఘటన అయినది. పునా శ్రీమంతుడు కూడా యీపని చేయనేరక శ్రాద్ధానంతరము విడిదికి భోజనానికి పోయినాడు, యీ పని యీ పురుషుడికి జరిగిన దని బ్రాహ్మణ మండలి సంతోషపడేటట్టు యీశ్వరుడు కటాక్షించినాడు. యిందుకు కారణము నా గయావళి అనుకూలము ఒకటి: మేజస్ట్రేటు కొత్తవాలును కూడావుండేటట్టుగా వుత్తర్వు చేసినంతలో ఆకొత్తవాలున్ను నూటికి బంట్రోతులతోకూడా హాజరు భాషిగా నావద్ద వున్నందున యీపని జరిగినది. యిక మీదు అక్షయవటము కింద అనేకబ్రాహ్మణభోజనాలు జరుగుతూ రావచ్చును. యీ అక్షయవటము షహరుకు అరకోసు దూరములొనే వున్నది.

11 డో దినము అష్టతీర్ధాలని రామగయ అనే కొండకింద