పుట:Kasiyatracharitr020670mbp.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సమ్మతముగా, లేవలేని గయాసురుడున్ను శిలా స్వరూపముగా వున్న పతివ్రతయున్ను ప్రార్ధించి నంతలో తాను అదేస్వరూపముగా ఉయెల్లప్పటికి యిక్కడ విరాజమాన మయ్యేటట్టు వొప్పుకున్నట్టున్ను అప్పట్లో కూడిన సమస్త దెవతలు చేసిన ప్రార్ధన ప్రకారము యెవరు యీ స్థలమందున "శమీపత్రప్రమాణేన పిండం దద్యాద్గయాశిరే" అనే శ్లోక ప్రకారము పిండ ప్రదానము ఛేసినా 101 కులమువారు తరించేటట్టు వర మిచ్చినాడు. గనుక తదారభ్య పితృస్వరూపుడైన పరమాత్మ యిక్కడ శ్రాద్ధ కర్మాలు చేసినంతలో అతితృప్తు డయ్యేటట్టు నిశ్చయ మయి యున్నది గనుక, ప్రతిదినము వుదయ ప్రభృతి సాయంకాల పర్యంతము సహస్రావధి ప్రజలు ఆ రీతిగా వుంచిన విష్ణు పాదలాంఛన మీద పిండప్రదానాలు చేస్తూ వుంటారు. శ్రాద్ధము వినా పిండప్రదానము మాత్రము కూడకపోయినా స్థల పురాణములో యీ స్థల మందు పిండప్రదానమే ముఖ్యముగా చెప్పివున్నది. గనుక అనేక ముగా పెట్టవలసిన శ్రాద్ధాలకు బదులు యీ స్థలాంతర్భూతమయిన ప్రదేశాలలో పిండప్రదానాలు మాత్రమే ఛేయుచున్నారు గనుక నేను ఆ దేప్రకారము ఛెసినాను.

నెం. 27 అష్టగయ చేయవలసిన క్రమము:-- క్షేత్రము ప్రవేశించిన దినము ఫల్గునినదిలో స్నానముచేసి గదాధర్శనము విష్ణుపాదము గుడి బహుపాదదర్శనము విష్ణుపాదదర్శనముచేసి క్షేత్ర వుపవాసము వుండవలసినది. విష్ణుపాదము గుడి బహుసుందరముగా నల్లశిలతో ముందు విశాలమయిన ముఖమంటపముతోకూడా అహల్యాబాయి కట్టించివున్నది. అరటి పువ్వందముగా సువర్ణమలాముతో చేసిన కలశముతోకూడా ఒక స్తూపీ యేర్పరచి యున్నది. గదాధరస్వామి మందిరము అందుకు రెండో తరము విష్ణుపాదపు గుడికి చేరినట్టుగానే కట్టియున్నది. గోడలో చేర్చి గదాధరమూర్తిని నిలిపివున్నారు. విష్ణుపాదము, మనిషి అడుసులో కాలిపెట్టితే అడుగు యేర్పడ్డట్టు శిల మీద లాంచనగా యెర్పడివున్నది. బహుకాలమయినది గనుక రేఖాలాంచనలు తెలియవు. మహాపూజా కాలమందు ఆపాదము