పుట:Kasiyatracharitr020670mbp.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఫల్గుశ్రాద్ధ మనేది నాలుగోపక్షము. మొదటి పక్షానికి కుంఫిణీ సర్కారుకు 148 (రు 14 1/2) రూపాయి యివ్వవలసినది. రెండోపక్షానికి 74 (రు 7 1/2) మూడోపక్షానికి మూడున్నర రూపాయ, నాలుగోపక్షానికి రెండు రూపాయలు.

యీ గయా మాహత్మ్యము వాయుపురాణ గరుడ పురాణాంతర్భూతముగా యెనిమిది అధ్యాయాలతో యిక్కడ ప్రచురముగా వున్నది. వాటిసారము యేమంటే గయాసురుడనే రాక్షసుడు అతి దీర్ఘకాయము కలవాడు బహు తపస్సుచేసి సకలతీర్ధాలకన్నా తన దేహము అతి పవిత్రముగా వుండేటట్టు వరముతీసుకొని తన తొలుదేహవాసనసంబంధమయిన తామస పనులుచేస్తూ వచ్చినట్టున్ను, త్రిమూర్తులలో ఒకడైన బ్రహ్మ వాణ్ని శాంతిపొందించవదలచి వాడివద్దికి వచ్చి నీదేహము అతిపవిత్రము గనుక నీదేహముమీద నేను యాగము చేయతలచినానని చెప్పినంతలో రాక్షసుడు సమ్మతించి ఈక్షేత్రములో తలపెట్టి శయనించినట్తున్ను బ్రహ్మ ఋత్విక్కులను సృషృంచి యాగము వుపక్రమణ చేసినంతలో రాక్షసుడి శిరస్సు చలనతదశ పొందినట్టున్ను శిరస్సును కదలకుండా పెట్టేకొరకు యెన్ని గొప్పకొండలు తెచ్చివేసినా నిలవక చెదిరి చుట్టు పడి యిప్పుడు రామపర్వతము ప్రేతపర్వతముగా సమీపమున నిలిచివుండేటట్టున్ను అటుపిమ్మట అవశాత్తుగా నొకానొక పతివ్రత పురుషుడి శాపన్ని ధరించి శిలారూపముగా వుండగా ఆ శిలను తెచ్చి గయాసురుడి శిరస్సుమీద వుంచినట్టున్ను ఆ శిలా అతిపవిత్రమయినదిగనుక గయాసురుడు తోసివేయలేక శిరస్సు మీద వుంచుకున్నా వాడి శిరస్సుయొక్క కంపముమాత్రము వదల నందున బ్రహ్మ యాగము పరిపూర్తి చేసేకొరకు 'యీశాన విష్ణుకమలాసన ' అని శ్రాద్ధకాలములలో వచించే శ్లోకప్రకారము దేవతలందరు వచ్చిరి. విష్ణువు గదాధర స్వరూపుడయి ముఖ్యముగా ఆ శిరస్సు మీద వున్న శిలమీద కుడికాలుపెట్టి నట్టున్ను తదనంతరము శిరస్సు కదలకుండా బ్రహ్మ యాగము పరిపూర్ణ మయి నట్టున్ను యాగసంరక్షణ నిమిత్తముగా గదాధారుడై అక్కడ నిలిచిన విష్ణువు కరుణాసముద్రుడు గనుక వచ్చిన సకల దేవతల