పుట:Kasiyatracharitr020670mbp.pdf/263

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


షట్చాస్త్రముల వల్ల ఆదినుంచి వివాదస్పదములుగా వుండే ద్వైతాద్వైతమతాలు రెండుగాక విశిష్టాద్వైతమతము ఒకటి అతి ప్రసిద్ధమయి దక్షిణదేశములో యిప్పుడు వెగడియున్నది. అటు ఒకటే ఆశ్చర్యకరమయిన యుక్తులతో నేగడి విదిన్ని గాక ఆరుకాటి రాయజి* సర్వాధికారము చేయుచు వుండగా సాకారాద్వైతమని ఒక మతము వుద్ధరించి ప్రబలము చేయ తలచినాడు. పాండిత్య కుశలతలు అది శృతిస్కృతులనే వృక్షముయొక్క క్షేమాన్ని వతకకుండా వేళ్ళను భేదించడమేవృక్షమునకు బలక మని దక్షిణ దేశస్థులు మూలభేదము చేయుచువచ్చు చున్నారు. వారి తాత్పర్యానికి వ్యతిరిక్తముగా వృక్షము బలహీన దశను క్రమ క్రమశ: పొందుచున్నది.

అయినప్పటికి యీ సర్వోత్తమ మయిన కర్మభూమి కర్మ ద్వారా బ్రంహ్మానుసంధానము చేసే మార్గమును యేర్పచిన పూర్వీకుల తప: ప్రభావము అమితము గనుక జరిగిన అచాతుర్యాలకు విశ్వేశ్వరుడు మ్లేచ్చులవల్ల తగుపాటి శిక్ష కొంతకాలము హిందూదేశపు కర్మకులకు కలగచేసి యిప్పుడు సాత్వికగుణ ప్రధానులయిన యింగిలీషువారిని బహు దూరము నుంచి అనాయాసముగా యీ కర్మ భూమికి దెచ్చి యిక్కడి సార్వభౌమత్వము వారికి కలగ చేసినాడు. యిఖమీదటనున్ను ఆ కరుణా కటాక్షముతొనే మన అపరాధాలు క్షమచేశి ఆదిని వుద్ధరింపబడ్డ శృతి స్కృతి చోదితమయిన కర్మములున్ను తజ్జనితమయిన బ్రంహ్మానుసంధానమున్ను నిష్కల్మషముగా కాలాంతరములో సిద్ధించ వలశినది.


  • చెన్నరాజధానిని ఇంగిలీషు వారక్రమించే నాటికి ఈ సముద్రతీరపు భూమిని చాలవరకు కర్నాటక మనే వారు. ఆ కర్ణాటక నవాబునకే ఆర్కాటు నవాబు అనిపేరు. వాలాజా నవాబు కింద శిరస్తాదారు రాయరేడ్డిరావుగారు చాలా బలవంతుడుగా వుండేవాడు. ఇతడు 1809 లో చనిపోయినాడు.