పుట:Kasiyatracharitr020670mbp.pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదిహేనవ ప్రకరణము

పయిన వ్రాశినటువంటి పట్నాషహరులో డిసంబరు నెల 31 తేది దాకా వుండి 1831 సం|| జనవరి నెల 1 తేది ఉదయ మయిన 4 గడియలకు గయా మహాక్షేత్రానికి ప్రయాణమై పది ఘంటలకు పున:పున: అనే నదివద్ద చేరినాను. దారి సడక్కు వేసియున్నది. యిరుపక్కల తోపులు వూళ్ళు నిబిడీకృతముగా యున్నవి. గయా వ్రజనము చేయడానము పున:పున: నదివద్ద క్షౌరముచేసుకొని శ్రాద్ధము చేసి సంకల్పము చేయవలసినది గనుక అదేప్రకారము జరిగించినాను. దిగడానకు నదివొడ్డున స్థలములేదు గనుక బయలులో గుడారము వేశి వంటభోజనములు గట్టున గడుపుకుని రాత్రి నీమా నదామా అనే వూళ్ళవద్ద ఒక సరాయి, ఒక పబ్లిక్కుబంగళా వుండగా వాటి సమీపమండు నిలిచినాము. సరాయిమధ్యే ఒక భావియున్నది. సరాయి దిగడానకు మంచివసతి. యీ సరాయి పట్టణమునకు 9 కోసులదూరములో నున్నది. భాటబాగుగాని దువ్వరేగడ భూమి నీమా వదామా అనే రెండు వూళ్ళున్ను గొప్ప వూళ్ళేను. బాజారు వున్నది. అన్ని పదార్ధాలు దొరుకును. వంట చెరుకులు మాత్రము ప్రయత్నముమీద దొరకవలసినది. మిరిజాపూరు మొదలుగా అడివి సమీపముగా యీ ప్రాంత్యాల లేదు గనుక గొమయ శుష్కములు నాటుపురాలలో బహుశ: వాడుతారుగాని వంటచెరుకులు పట్టణములలో దొరికేటట్టు సహజముగా నాటుపురాలో దొరకవు. పున:పున: అనేనది నిండా వెడల్పు లేకపోయినా జీవనదిగా సార్వకాలము ప్రవహింపుచున్నది. యీ రాత్రిపయి రెండువూళ్ళవద్ద వసించియున్నాను.

జనవరి 2 తేది ఉదయమయిన 2 ఘడియలకు మంచువల్ల బాగా యెండవచ్చిన వనక బయలుదేరి యిక్కడికి 9 కోసుల దూరములో వుండే జానా అనే వూరు 1 ఘంటకు చేరినాను. దారి నిన్నటి వలెనే బాగా సడక్కుకలిగి యున్నది. ఈ వూరు షహరువంటి వూరు, 1000 యిండ్లు కద్ధు; బట్టలుకూడా నేశి అమ్ముతారు. గొప్ప బాజారు