పుట:Kasiyatracharitr020670mbp.pdf/262

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అబద్ధము, తరమే యేనుగ అబద్ధము, బ్రహ్మమనే అస్తువఒకటే సత్యము అని ద్వైతులు నవ్వేటట్టుగా అద్వైతి అనుకున్నట్టు ఒక్కటే వస్తువని అంతస్తులోనమ్మి ఆవస్తువే యిన్నిగా వున్నదనే నిశ్చయముతో పయికి కనపడే అనేక వస్తువుల స్వరూపాలను మనోవికాలుగా భావించి అయినప్పటికిన్ని దేహబుద్ధి వుండేవరకు వాటికి తారతమ్యములు విచారించి తారతమ్యమయిన పనులు చేయవలసినది గనుక యీరీతిని నడవడానికి సాంప్రతాయకము తెలిసినవారే నడుతురుగాని నూతనస్తులు ఒకటి అనుకుంటూ ఒకటి చేయడము ప్రయాస గనుక చేసిన సంకేతము వదవక చేడిపొవనే తాత్పర్యముచేత పూర్వికులు అదినం కేతానికి లోబడ్డవారి వంశస్థులే యీ నర్ణాశ్రమధర్మాలు జరపవలనని నిశ్చయము చేసినారని నాకు తోచుచున్నది.

పయినవ్రాసిన మూల స్కృతులు 12 గాక మరికొన్ని స్మృతులుగూడా మూలస్మృతులని వివాదాస్పదములుగా వున్నవి. ఋగ్యజుస్సామాలుగాక అధర్వణమున్ను వొక ప్రత్యేకమయిన వేద మని వివాదముగా వున్నది. బ్రాహ్మణమండలి పయినవ్రాసిన ప్రకారము భిన్నులయి ఒక తెగ దక్షిణదేశ నివాసులయిన వనక దేశకాలాలకు అనుగుణముగా దక్షిణానికి సాగివచ్చిన మండలిలోని పండితులు నూరారులు ఉపస్కృతులు వ్యాస: వశిష్ట: నారద: అని ఆకరాలు వ్రాసి వారి వారికి సమ్మతి అయినట్టు వుపస్కృతులు యేర్పరచినారు. దక్షిణదేశములో మూల స్మృతుల సంగ్రహించడము విస్తారము లేనందున యెల్లాజియ్యము, నిర్ణయసింధు మొదలయిన ఉపస్కృతులే సంభవించే విషయాల పరిష్కాతము నిమిత్తము యెత్తిచూచుచున్నారుగాని మూల స్కృతుల జ్ఞాపాకమే మరచినారు. ఉత్తరదేశములొ పండితమండలి బహుశ: దక్షిణదేశానికి లేచిపోయు నందుననున్ను మూలస్మృతి సంగ్రహమును తాము విపత్తులచేత చేసి వుండనందున నున్ను యిటు వెనక పుట్టిన మితాక్షరము సరస్వతీ విలాపము మొదలయిన కొన్ని వుపస్కృతులె హిందుస్తాన్ లో ప్రచురముగా వాదుతారుగాని దక్షిణదేశమువలె యిక్కడ వున్న స్మృతుల పరంపర అనర్గళ పరంపర అనర్గళ ప్రవాహమై వుండ