పుట:Kasiyatracharitr020670mbp.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కున్ను వివాదము పడి ఒక నిశ్చయానకు వచ్చినాము గనుక ఆమూల స్కృతుల పేళ్ళు యీ అడుగున వ్రాయుచున్నాను. నెం.23, స్వాయం భువమను స్కృతి 1. బృహస్పతి స్మృతి 2. వశిష్టస్మృతి 3. కశ్యప స్మృతి 4. భారద్వాజస్మృతి 5. గౌతమస్మృతి 6. యాజ్ఞవల్క్య స్మృతి 7. భృగుస్మృతి 8. నారద స్మృతి 9. కపిల స్మృతి 10. పరాశరస్మృతి 11. వ్యాసస్మృతి 12. కాత్యాయన స్మృతి 13. ఆపస్తంబ స్మృతి 14. అశ్వలాయనస్మృతి 15. కణ్వస్మృతి 16. అత్రిస్మృతి 17. హరీత స్మృతి 18. యివి మూల స్మృతులు అనడానకు యెవరు సందేహపడనేరరు. కాశిలో యీ వివాదము పొశిగివున్నట్టయితే కుంఫిణీవారి పాఠక శాలలోనున్ను యింకా అనేకులవద్ద నున్ను గ్రంధగ్రహము బాహుళ్యముగా వున్నది గనుక వయిపు (వీలు) అయునన్ని మూల స్మృతులు సంపాదింతును.

ఇటీవల మారీసుదొర బహురసికుడును బహు శోధకుడున్ను గనుక సహగమనము స్త్రీలకు కూడదని లార్డు బెంటిక్కుగారు విధించి యిటీవల యేర్పరచినారు గదా, మీలో స్త్రీలు పురుషుడు చనిపోతే అగత్యముగా సహగమనము చెయ్యవలసినదేనా? చేయక పోతే ప్రత్యనాయమా? అని ప్రశ్నచేసినాడు. మను పరాశరులు అదిస్మత్రలు; వారి స్మృతులలొ పురుష దేహాసంతరము విధవస్త్రీలు నడవలసిన విధులను విధించి వ్రాశినారుగాని సహగమనము చేయ వలసిన దని విధిగా మూలస్మృతులలొ వ్రాయలేదు; నేను బహుదినాలుగా యీ సంగతిని విచారింపు చున్నాను; ఉపస్మృతులలో యీ విషయానకు అనేక ఆకరము లున్నవిగాని మూల స్మృతులలో లేదని చెప్పినంతలో యిక్కడి కోటపండితులు తద్వ్యరింతముగా చెప్పి తుదను మూలస్మృతులలో సహగమనానికి ఆకరము లేదని ఒప్పుకున్నారు.

యీ స్మృతులు కల్పించిన వారి పేళ్ళనున్ను ఋగ్యజు స్వామాలను భూమిలో ప్రచురము చేసిన భారద్వాజుల పేరున్ను సావధానముగా యోచిస్తే వారు యీ కర్మభూమిలో వుత్పత్తి అయినవారు