పుట:Kasiyatracharitr020670mbp.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాత్రమేగాక ఆయా 18 ఋషుల జననమును జనన కాలమున్ను పురాణాదులవల్ల వూహించి చూడగా సృష్టికి బహు కాలమునకు వెనక వారు జననమయిన వారుగా అగుపడుతున్నారు. అప్పటికి వర్ణాశ్రమ ధర్మాలు సృష్టిక్ ఆదిన కలిగినవిన్ని కారు. యీశ్వర నిర్ణల్యమున్ను కాదు. అయితే భారద్వాజులేమి స్వాయంభువమను నేమి, పరాశరులేమి, గౌగము లేమి, కశ్వపు లేమి, యింకా యితర స్మత్రలేమి వీరిని మనుష్య మాత్రులుగా చెప్పకూడదు; బ్రహ్మజ్ఞానము కలవారు గనుక సచ్చిదానంద స్వరూపులుగానే చెప్పవలసినది.

పయిన వ్రాసిన ప్రకారము వర్ణాశ్రమ ధర్మాలు వారు నియమించినంతలో యేతత్సంకేతానికి ఆ దినము లోబడ్డవారి రకత పరంపర గలవారే ఆ ధర్మాలను ఆచరించవలసినది గాని యితరులు ఆచరించకూడదని అప్పటి సంకేత ప్రకారము నియమము యేర్పడ్డది గనుక క్రీస్తు మతస్థులవలనున్ను చూచినవారికంతా బోధించి నిర్బంద పెట్టి యీ హిందూమతములో కలుపుకోవడానకు హిందువులకు నిమిత్తము లేకుండా పోవడము మాత్రమే కాకుండా ఆ ప్రకారము నియమించబడ్డ ధర్మాలుతప్పి నడిచిన వారినంతా యీ హిందు సమూహములోనుంచి తోశి అటు ప్రార్థింఛే క్రీస్తు మహమ్మదు మతస్థులతో చేరేటట్టుగా ప్రేరేపణ చేయడమవుచున్నది. ముఖ్యముగా వర్ణాశ్రమ ధర్మాలు చేసినంతలో వర్ణాశ్రమములు సిద్ధి అయ్యేటట్టుగా శాస్త్రాలు యేర్పడివుండడము మాత్రమే కాకుండ ఆదినం కేతానికి లోబడ్డ వారి పరంపర వంటివారే ఆ కర్మాదులు చేయవలసినది గాని యితరులు ఆకర్మాదులు చేసినంతలో ఆ వర్ణాశ్రమములు చిద్ధించక పోవలసినదని కూడా వెంబడిగా ఒక విధి శాస్త్రాలలో యేర్పడి వుండవలసిన దేమని యోచించిగా భారద్వాజులు మనకోసరము భూమిలో ప్రచురము చేసిన మూడు శృతులున్ను మన్వాదులు తదనుసారముగా చేసిన స్కృతులున్ను 'గజోమిధ్యా పలాయనం మిధ్యా' అని అడివి యేనుగ బ్రహ్మజ్ఞాని తరిమితే తప్పించు కోవడానికి పరిగెత్తుతూ 'జగన్మిధ్యా బ్రహ్మసత్య ' మనే అద్వైత వచన ప్రకారము నా పరుగు