పుట:Kasiyatracharitr020670mbp.pdf/259

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


దీప దీపికా న్యాయముగా బ్రంహ్మాండమంతా మానుష మండలితొ నిబిడీకృత మవుతూ వచ్చుచున్నది.

అటు సృష్ట్రికి అది మనుష్యులు యీ ప్రదేశములొ వసించినందు చేతనున్ను వారు సచ్చిదానంద స్వరూపుడైన యీశ్వరునికి యధోచితిముగా సమానులుగా వుండవలసినవారు గనుకనున్ను తద్వారా వారు స్వేచ్చామరణము గలవారుగా వుండవలసినవారు గనుకనున్ను అటువంటి మహాత్ములు యీశ్వరుని చిద్విలాసము చూచి బహు కాలము ఆనందింపుచు వుండడానకు కోరి చిరకాలము జీవింపుచు వుండవచ్చును గనుక నున్ను వారి యీ భూమిలో సృష్టులయినవారి పరంపరలను చూచి, నాలుగు ముఖ్యమయిన పనులకుగాను మానుష కోటిని నాలుగు వర్ణములుగా నియమించి, యీ నియమింపబడిన వారి పరంపరే ఆ యా వర్ణాశ్రమకృత్యములు చేయుచు వుండతగినవి కాని వొక వర్ణమువాడు మరియొక్క వర్ణము కృత్యములు చేయకూడదనిన్ని ఒక వేళ చేస్తే భ్రష్టులవుతారనిన్ని శిక్షకూడా విధించి ఆయా వర్ణాశ్రమాలలో నున్నవారు వర్ణానుసారముగా చేయ వలసిన పనులు తెలియడానకు పూర్వికులు శృతి స్మృతులు చేసి యిచ్చి నారనిన్ని తేట పడుచున్నది. అందుకు ఆకరము యజుర్వేదములో భరద్వాజమహామునివల్ల శృతులు మానుష మండలిలో ప్రచురము చాయబడ్డవని వున్నది. అష్టాదశ స్మృతులున్ను వాటి వాటి నామాంకితాలవల్లనే మంవాదులయిన యిక్కడ మనుష్యులఛేత వర్ణాశ్రమ ధర్మాలను నియమించి తెలియ వ్రాయబడిన పుస్తకము లని తేట పడుచున్నవి.

మూల స్మృతులు 12 స్కృతులున్ను ఆజ్ఞలను విధించి నట్టు విషయాదులను నిరూపించి చెప్పుతూ వచ్చును గాని ఫలాని ఋషి మతము యిది, అందుమీద నామతము ఇది, అని మూలస్మృతులు చెప్పవు. అటు ఋషులు మతాలు వుదాహరించి చెప్పే వంతా ఉపస్మృతియని శానా దూరము వలసినది. ఇందులొ యేదేది మూల స్కృతియని శానా దూరము గయలో జడ్జీగా వుండే జార్జి ఐ. మారీసు దొరగారి సన్నిధానమందు నాకున్ను యిక్కడి పండితులు