పుట:Kasiyatracharitr020670mbp.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నందున దేశభాష అక్కడ ఆంధ్రమ యినందున ఆంధ్రమయినందున ఆంధ్రులయినారనిన్ని రెండోతెగ కావేరీ తామ్రపర్ణీనదుల సమీపములో చేరినందున ఆ దేశభాష రీత్యా వారు ద్రావిళ్ళు అయినారనిన్ని మూడోతెగ గోదావరి యుత్పత్తికి సమీపముభూమి అయిన నాసికా త్రియంబకము మొదలయిన భూమెచేరినందున దేశభాషరీత్యా వారు కొంకణులని మహారాష్ట్రులని రెండు నామములు గల దేశస్థులైనారనిన్ని నాలుగో తెగవారు కావేరి యుత్పత్తికి సమీపస్థళమయిన కర్ణాటకులైనారనిన్ని తోచుచున్నది.

నిండా విచారించగా ఘూర్జరులు మాత్రము ఎప్పుడున్ను హిందుస్తాన్ లోనుంచి యెత్తిపోయిన బ్రాహ్మణులతో చేరినావారు కారు. వారు ఎల్లప్పుడున్ను ఘూర్జర దేశములోని కాపురస్తులే నని తోచబడుచున్నది. అయితే వారిని పంచద్రావిళ్ళతో కలిపి వాడడము ఎందువల్లనంటే వారున్ను ద్రావిళ్ళరీతిగా వింధ్య దక్షిణదేశ నివాసులయి వున్నందుననున్ను హిందూస్తాన్ లో అయిదు తెగలుగా అయిదు దేశాలలో బ్రాహ్మణులు వృధక్కు వృధక్కుగా భాగింపబడి వున్నందున యీ పంచగౌడులకు ప్రతిగా పంచగ్రావిళ్ళు అనుకోవడానకు ఘూర్జరులను కూడా కూర్చి వాడుకుంటూ వచ్చేటట్టు తోచబడుచున్నది. అందుకు ప్రబలమయిన కారణము యేమంటే యీ దేశములోపుట్టిన గయావళీలు మొదలైన స్థలవాసులు ఘూర్జరులు వినాగా వుండే నాలుకు తెగల ద్రావిళ్ళు అన్నశ్రాద్ధముచేస్తే బ్ర్రాహ్మణార్ధముచేసి వారి పాకములో భోజనము చేస్తారు గాని ఘూర్జర బ్రాహ్మణులు చేసే శ్రాద్ధాలలో భ్రాహ్మణార్ధము నిమిత్తమైవారి పాకములో భోజనము చేయడము లేదు. ఘూర్జరుల చేత చటకశ్రాద్ధము చేయించి శీదా లనే స్యయంపాకము గయావళీలు పుచ్చుకుంటున్నారు. అందువల నున్ను యీ ఆచారములనే అద్యాపి దక్షిణ దేశమందున్ను కడమ నాలుగు తెగల ద్రావిడ బ్ర్రాహ్మణులున్ను పాటిస్తూ వుండడము చేతనున్ను కావేరి తామ్రపర్ణి తీరాల యందు మాత్రము ఘూర్జర బ్రాహ్మణులు నిండా కర్మకులుగా