పుట:Kasiyatracharitr020670mbp.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ధారణలు కూడా వీదు ఫలాని దేవతోపాసకుడు, వీడు ఫలాని కర్మము చేసేవాడని గురుతు వుండే కొరకు సంపూర్ణముగా భేదించే టట్టు ఛెసినారు. అది మొదలు దిన దినానికి శైవ వైష్ణవులున్ను తదంతర్భూతులున్ను యితరులున్ను ద్వేషములకు అంతము లేకుండా యిప్పటికిన్ని వివాద పడుతూ వున్నారు.

హిందూస్తాన్ లో ప్రవేశించిన తురకలు క్రమ క్రమశ: వింధ్య దక్షిణచేశములో కూడా పిమ్మట ప్రవేశించినా యిక్కడ హిందువుల సహవాసము తత్పూర్వము తమకు నిండా కలిగి వున్నందుచేతనున్ను హిందువుల మత సంకేత బలాబలాలను చక్కగా తెలుసు కొని వున్నందు చెతనున్ను తమ మతోద్ధారకుడైన మహమ్మదు తనువు ధరించిన తమ మతము శ్రేష్టమని లోకులకు బోధపడే కొరకు తమ మతములో ఒకణ్ని కలుపుకొని తురక చేస్తే పుణ్యమనిన్ని తమ మతముకాని వాని మొగము చూడరా దనిన్ని ఖురానులో వ్రాసిన మాటను నమ్మి మూఢభక్తి కలిగిన తురక భూపతులు యిక్కడ అదిలో తురకల చేసే కొరకు హిందువులను హింస పెట్టినట్టు దక్షిణ దేశములో పిమ్మట వారు హింసించిన వారు కారు. రాజ్యకాంక్ష కలిగిన బుద్ధి ఆ విషయములో వారికి సాత్వికాన్ని సంపాదించి యిచ్చినది.

వెనక వెంబడిగానే నడితి వెరేనున్ను తత్వము వేరేగానున్ను వుండే హిందువుల బహిరంగ కృత్యములు చూచి వీండ్లు వెర్రివాండ్లు తెలియక రాళ్ళు రప్పలు నదులు కొండలు యివి మొదలైన వాటిని దేవుండ్లనుగా యెంచి చెడిపోతారనే పశ్చాత్తాపబుద్ధి మాత్రమే కలిగిన అతి దూరములోవుండే సాత్వికగుణప్రధాను లయిన యింగిలీషు జాతి వాండ్లు హిందుదేశానికి భూపతులయినందున వారివల్ల కర్మాదులు యేహ్యపడ్డా ప్రబలవిరోధము మాత్రములేక తమ తమ కర్మాదులు తమ తమ యిష్టాల్నుసారముగా సారినమట్టుకు గడుపుకొంటూ యిప్పుడు దాక్షిణాత్యులు అక్కడ వున్నారని తోచుచున్నది.

పయిన వ్రాసిన ప్రకారము గంగా యమునా తీరవాసులయిన బ్రాహ్మణులలో కొన్ని తెగలు వింధ్య దక్షిణదేశములో ప్రవేశించిన వెనక నొక తెగ కృష్ణాగూదావరీ నదుల సమీపప్రాంతమందున చేరి