పుట:Kasiyatracharitr020670mbp.pdf/256

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


నడవపట్టి ఒక మాత్రముగా వారితో భోజన ప్రతిభోజనాలు కల్గివుండుట చేతనున్ను భగవత్పారుల వారు దిగ్యిజయము చేసినప్పుడు ఘూర్జర దేశములోనే నివాసులుగా వున్నట్టు శంకర విజయములో కని వుండుట చేతనున్ను బ్రాహణ మండలి పృధక్కు కాకమునుపే యీ మండలిలో చేరక ఘూర్జరులు ప్రత్యేకముగా స్వదేశ నివాసము యెప్పుడు ఒకటే రీతుగా ఛెస్తూవుండే టట్టు తోచుచున్నది.

యీ ప్రకారము యిప్పుడు తెలివచ్చి వుండే పంచగౌడులు పంచద్రావిళ్ళు అనే పదితెగల బ్రాహ్మణులు గాక పరశురామ నిర్మితమైన కేరళదేశాస్థులు, చిత్పావనులు, కరాడీలు, అనేమూడు తెగలవారు వున్నారు. యీ మూడు తెగలలో పునా శ్రీమంతుడు చిత్పావన బ్రాహ్మణుడై సార్వభౌముడై బహుకాలము ప్రవర్తించి నందున కొంకణస్థులలో నాశికాత్రయంబక నివాసులైన బ్రాహ్మణులకు కనకాభిషేకాలుచేసి, ఆ తెగతొ పూరాగా తాను తన జాలాన్ని కలిపి కరాడీలను కూడా కలిసినారు. యిప్పుడు మహారాష్ట్రులకున్ను వారికిన్ని యెంత మాత్రమున్ను భేదములేకుండా వుభయులు వొకరితో వొకరు కలిసి యున్నారు. యీ తెగలు గాక కేరళ దేశస్థులు తమ దేశములొ పూజ్యులుగా, యితర బ్రాహ్మణులతో నిండా కలియక నున్ను కలియ కూడకనున్ను నంబురు (నంబూద్రీ) లనిపించుకొని తమంతట తాము వుండి వున్నారు.

గయలో బ్రహ్మ కల్పిత బ్రాహ్మణులనే వొక తెగవారు గయావళీలుగా వున్నారు. కాశిలో గంగా పుత్రులని వొక తెగవారు గయావళీలుగా వుండి వున్నారు. యిదిన్నిగాక శాకద్వీప బ్రాహ్మణులని వొక తెగవారు హిందూస్థాన్ దేశములో వాసము చేస్తూ యిప్పటికిన్ని వున్నారు. వారి వృత్తాంత మెమంటే శ్రీకృష్ణులు ద్వారకలో విరాజమానులయి వుండగా సాంబుడనే అతని కొమారుడికి పెద్దరోగము ప్రాప్తించి నట్ట్లున్ను చికిత్స నిమిత్తమై వైనతేయుడు శాకద్వీపమునుంచి వొక బ్రాహ్మణుని తెచ్చినట్టున్ను వాని వంశస్థులు తామని ఆ తెగవారు అద్యాపి యీ దేశములొ చికిత్స చేస్తూ నెగడి వున్నారు. పైన వ్రాసిన తెగలుగాక యీ హిందూస్తాన్ లో విశ్వరర్మకు రంభకున్ను