పుట:Kasiyatracharitr020670mbp.pdf/252

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


యీబ్రహ్మాండమునందు నున్న బ్రాహ్మణమండలి ద్రావిళ్ళ నిన్ని, గౌడులనిన్ని రెండు తెగలుగా చీలి ఆ రెండు తెగలలో నున్ను అయిదేశి తెగలు యేర్పడి తుదకు పది తెగలుగా చీలినది. అందులో గౌడులకు సొంతమయిన భూమి సాత్విక ప్రధానముగా అనాదిగా వుండుటచేతనున్ను స్థూలదేహాలు పృధివీ భూతానుగుణముగా వుండేవి గనుకనున్ను అనాది సంప్రదాయ ప్రకారముద్వైతాద్వైతాలు శాస్త్రము చేత వాదింపబడుచునున్నా కర్మదృష్ట్యా ఉపాస్యదేవతలు భిన్నుములు గానున్నా యెదటివాడి ఉపాస్యదేవతను నిందించకుండా స్వంత తండ్రిని కాపాడి యితరుల తండ్రులను కొట్టక తిట్టకవుండి మర్యాద చేయుచు వుండేటట్టు తమ తమ అంత:కరణాను గుణముగా ఉపాసనములు చేయుచు అందరు అన్యోన్యముగా ప్రవర్తింపుచున్నారు.

స్వదేశము వదిలి కర్మము మీది శ్రద్ధ విస్తారము కలగ చేసుకొనుట చేత లేచి వచ్చిన దక్షిణ దేశస్థులయిన ద్రావిళ్ళు వింధ్య పర్వతాలకు దక్షిణదేశమునందు ప్రవేశించగానే ఆ దేశవాసులు అందరు అప్పట్లో శ్రుతి స్మృతి పురాణాదుల సంకేతాలకు నిండా లోబడని వారలై మూఢులుగా ఉన్నందున వింధ్య దక్షిణదేశమునకు యిక్కడినుంచి లేచి వచ్చినవారు చేతనయినంత మట్టుకు కృత్య సంకేత ప్రకారము వైశ్యజాతిని మాత్రము కల్పించ తలచి క్షత్రియ కృత్యానికి తగినవారు లేనందున ఆ వర్ణకల్పన వదిలి తాము బ్రాహ్మణులుగానున్ను తాము కల్పించినవారు వైశ్యులుగానున్ను యితరు లందరు శూద్రులుగానున్ను యేర్పాటుచేసి అలాగే ప్రవర్రింపుచూ వచ్చినారు. అందువల్లనే వైశ్యులు మేమంటే మేము వైశ్యులమనే వివాదము అద్యాపి దక్షిణదేశములో తీరకుండావున్నది. వింధ్యకు దక్షిణదేశ నివాసులు అందరున్నూ తత్పూర్వము శూద్రులకు శ్రుతి స్మృతి పురాణాదులగుండా నియమింపబడియుండే ఆచారాలు యెరగక నొక మూఢ ధోరణి అయిన తమ పూర్విక మార్గముగా ప్రవర్తింపుచు వున్నందున, ఇక్కడినుంచి లేచి వచ్చిన బ్రాహ్మణులు శూద్రులతొ తాము యీదేశములో ప్రవర్తింపుచూ వచ్చిన జాడ వదిలి తమ యెక్కువగౌరమును ఆపాదించుకొనే కొరకు వాండ్లను