పుట:Kasiyatracharitr020670mbp.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొంత వెలిగా వుంచి తదనుగుణముగా ఉపస్మృతులు పురాణాదులు కల్పనచేసి అక్కడి భూపతులకు బోధించి తమకు తోచిన కర్మాదులను క్రమక్రమముగా ఆచారవ్యవహారాదుల మూలముగానున్ను బింబారాధనల ద్వారానున్ను ప్రబలపరచుచు వచ్చినారు.

వింధ్యకు నుత్తర దేశవాసులయిన బ్రాహ్మణులు అందరున్ను ఋషులని అద్యాపి బ్రాహ్మణుల సంధ్యావందనములలో గంగా యమునల నడుమనున్న ఋషులకు సమస్కార మని వచిస్తూవున్నారు. దక్షిణదేశములో తత్పూర్వము బ్రాహ్మణులు లేనందున యీ దేశము నుంచి వచ్చిన బ్రాహ్మణులను నాక్షాదృషులనే తాత్పర్యముతో దక్షిణదేశములోని భూపతులు వీరు చెప్పినట్టువిని, ఆలయాదులు వాటి ఆరాధనలు, బ్రాహ్మణ గౌరవము, వారిపోషణ, మొదలయినవి సకలవిధాల చేస్తూ వచ్చినారు. అప్పట్లో యీ బ్రాహ్మణులు వింధ్యకు దక్షిణ దేశానికి రావడము సూర్యుడు భూమికి దిగివచినట్టు అక్కడి భూపతులకు తోచినది గనుక యీ బ్రాహ్మణులు తమ దేశము వదిలిపోకుండా వుండేకొరకు అపారమైన భూస్థిరులు యిచ్చినారని నాకు తోచశాడుతున్నది. యిప్పట్లో అక్కడి బ్రాహ్మణులు అనుభవించే భూస్థితులవంటివి యేకాలమందున్ను యీదేశపు బ్రాహ్మణులు యిక్కడ అనుభవించినది లేదు గనుక యీ హేతువు పై వూహకు నిండా అకరముగా వున్నది.

యీ ప్రకారము కర్మశ్రద్ధ మితిని మింఛేటట్టు చేసేకొద్దిన్ని క్రమక్రమముగా తమలోతమకే యీకర్మము చేసుటచేత నేను యెక్కువంటే ఆ కర్మము నీవు చేయతగవు గనుక నీవే తక్కువ యని వివాదము పుట్టి వివాద పురస్సరముగా ద్వేషము జనించి నీవు చూడగా నేను బోజనము చేయరా దనిన్ని నీవు తాకిన పాత్ర నేను కడగక వాడుకో ననిన్ని, నీ యుపాస్య దేవత మీద ఫలాని ఫలాని దోషాలు వున్న వనిన్ని, నా యుపాస్యదేవత గుడికి నీవు రాకూడ దనిన్ని, నీయుపాస్యదేవత గుడి నీడలోకి కూడా కూడా నేను రా ననిన్ని వాదింపుచు తమ్మున గురుభావనగా ఆరాధింపుచూ వుండే అక్కడి దేశస్థులకు కూడా వారిలో వారికి అలాటి ద్వేష బుద్ధిని పుట్టించి పుండ్రాలు వస్త్ర