పుట:Kasiyatracharitr020670mbp.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గంగలో కలియుచున్నది. చప్రావద్ధ కర్మనాశినీ అనే నది దక్షిణము నుంచి వచ్చి గంగలో కలియుచున్నది. యీ కర్మనాళిని నదిలో యెవరు కాలుపెట్టినాగాని సుకర్మాలు నశించుచున్నదనే తాత్పర్యముచేత కర్మఠులు యెవరున్ను యీనదిలో కాలు పెట్టరు. యీనది దాటడానకు కాశీనుంచి గయకు వచ్చే దోవలో అహల్యాబాయి అనె యశ:కాయము గల పుణ్యాత్మురాలు వారధి కట్టడానకు శానా యత్నము చేసినది. యిప్పటికి ఆమె చేర్చిన సామానుతో కట్టాడానకు అనేకులు యత్నము చేసినా కొనసాగలేదు.

యీ పట్నాషహరువద్ద పునఃపునః అనే నది దక్షిణమునుంచి వచ్చి గయవద్ద వచ్చే ఫల్గుని నదివలెనే గంగాసంగమ మయినది. యీ పున:పున: అనేనది గయా క్షేత్రమునకు ప్రదక్షిణముగా ప్రవహింపుచున్నది గనుక యెటువంటి గయకు వచ్చే వారున్ను యీ పున:పున: నదివద్ద క్షౌరము చేసుకొని తీర్ధశ్రాద్ధము చేసి గయావ్రజనము చేయడానకు నియమము ధరించవలసినది.

దక్షిణమునుంచి వచ్చే పయినదు లంతా నర్మదానదివలెనే వింధ్య పర్వతములొ ఉత్పత్తి అయినవి. శోణభద్రా నదిన్ని, నర్మదానదిన్ని ఒక్క ప్రదేశములోనే ఉత్పత్తి అయి రెండు ధారలుగా చీలి ఒకటి లింగాలనున్ను, మరి ఒకటి వినాయకశిలలనున్ను జగత్తుకు కలుగ ఛేసి యున్నవి. యిదిగాక పేరు ప్రశస్తములేని కొన్ని నదులు ఉత్తరము నుంచి వచ్చి కాశీ పట్నాలమధ్యే గంగలొ కలియు చున్నవి.

కాశి మొదలు పట్నాషహరు వరకు గంగకు ఇరుపక్కలా సరసు అనే పెద్ద ఆవాలున్ను, రాయి అనే చిన్న ఆవాలున్ను, బూటి అనే శనగలున్ను, పటానులున్ను, కందులున్నూమితముగా పయిరు చేసి యున్నారు. యీ పెద్ద ఆవాలు చెట్లు ముల్లంగి చెట్లవలెనే ప్రధమములో పయిరు అయి యెన్నుతీసి పచ్చని పూలు పూచి, గోరుచిక్కుడు కాయలవలె కాయలు కాయుచున్నవి. యీ ఆవకూర యీమంచు దినములలో పుల్లకూరవండి యీ దేశస్థులు అవశ్యముగా పుచ్చుకొను చున్నారు. పుల్లకూర బహురుచిగా వుంచున్నది. మంచు కాలములొ దేహానికి లేపనము చేసేటందుకు నాలుగు '