పుట:Kasiyatracharitr020670mbp.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పెరుగు, పాలు, కూరగాయలు - ఇత్యాది అనేక దినముల పరియంతము బాగావుండని పదార్ధాలకు గాను ఒకవేళ గంగకు ఇరుపక్కలావుండే వూళ్ళలోకి వెళ్ళితే మనుష్యులు వెళ్ళీ రావలసినది. సుఖహేతువులంతా కష్టసాధ్యములు గనుక యీ గంగా తీర సంచారసుఖానుభవములో పడవలోకి నీళ్ళు వూరి వచ్చిన దనిన్ని పడవ తోశే వాండ్లు చెప్పినట్టు వినలేదనిన్ని కూడా వుండే పరిజనుల ప్రకృతులు భిన్నాలు అయినందున వాండ్లు ఒకరితో నొకరు కలహము పడడము వల్లనున్ను, వద్దవుండే స్థితికి చోరులవల్ల అపాయము వచ్చునేమో అనే భయముచేతనున్ను, మనస్సుకు అప్పుడప్పుడు ప్రపంచదృష్టి పూరా కలిగిన దేహాధీన మయినందున వికల్పము కలుగుచున్నది. అప్పట్లో జగము యావత్తు పరబ్రహ్మ ఆడించే బొమ్మలుగాని, వేరే కాదనిన్ని తృణాగ్రమయినా యీశ్వరాజ్ఞ చేతనే కదల వలసినదిగాని మరిఆన్యధా కాదనే తెలివితోనున్ను మనస్సునిండా ఖేదాన్ని పొందనియ్యకుండా బుద్ధిద్వారా శిక్షించి నట్టయితే పయిన వ్రాసిన స్థలజల సౌఖ్యములు మిక్కిలి ఆనందములుగా తేటపడు తున్నవి.

యీ గంగలో నడిచే అనేకపడవలు అనేక భేదములు కలిగి యున్నవి. అందులో విచారించగా తెలియవచ్చిన వాటిని అడుగున వ్రాసినాను. నావల భేదక్రమము బజరా 1. అది ఒంటికంభము కలది. వెడల్పుయెక్కువ. తలపక్కచుక్కాణి, చుక్కాణి మొదలు పొడుగున తగ్గుచూవచ్చు చున్నది. పిన్నిస్సు 1. అదిరెండు కంభాలుకలది. నిడువు యెక్కువ. మొనను చుక్కాణీ. యిల్లు మధ్యే వుంచున్నది. పొడుగు కొనా మొదలున్నుసమము. కటరు 1. అది పిన్నిసుజాడ; గాలిని చాపలచేత వైపు (వీలు) చేసుకోవచ్చును. బవులియ్యా 1. అదిబజరాజాడ; గాలిని చాపలచేత స్వాధీనము చేసుకోవచ్చును. డోంగా 1. అది చిన్నయిల్లు గలతేలిక పడవ. బాలిబోటు 1. అది చెయిపడవ. పయిన వ్రాసిన ఆరుదినుసులు సవారీలాయఖు. సర్కు మోసే నావలు పట్టేలి 1. అది మిరిజాపురపు శాత. పొడుగు తక్కువ. వెడల్పు యెక్కువ. వులాకు 1. అది పట్నాశాత.

పట్నా మధ్యే గంగకు యిరుపక్కలా వుండే వూళ్ళలో గాజీ