పుట:Kasiyatracharitr020670mbp.pdf/244

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


విధాలు పరిమళ శైలములు యిక్కడ తయారు అవుతున్నవి. వాటి పేళ్ళు సుగంధరాజతేలు అనేది ఒకటి, బేలా అనేదిఒకటి, చెంబెలిఅనే నూనె ఒకటి, పూలేది అనేనూనె ఒకటి, ఇవి వుపపన్నులు చేసుకొనేవి. పేదలు పెద్ద ఆవాలనూనె పట్టించుకొను చున్నారు. యీ తైలాలతో అంగమర్ధనము చేయకపోతే చర్మములో ల్నుంచి సూదితో కుట్టి నట్టు బెజ్జాలుపడి నెత్తురు చెమ్మగింపు చున్నది. యీ ప్రకారము నాపదిజనానకు నడిచేటప్పుడు కాళ్ళలో కొందరికి నెత్తురు చెమ్మగించి నందున భయపడి వారు యిందుకు వైద్యము ఆవనూనె పట్టించి వేన్నీళ్ళు పోసి కడిగితే వెంబడిగానే వాశి అయిపోతున్నది. చిన్నఆవాలలో నూనె నిండా రావడము లేదు గనుక చిన్న ఆవాలను భక్ష్యయోగ్యముగా వాడుకొని, పెద్దఆవాలలో మాత్రము నూనెను గానుగ ఆడి తీయుచున్నారు.

యీ మంచుకాలములో బ్రాహ్మణ సంతర్పణలు కాశిలో నావల్ల యీశ్వరుడు జరిపినప్పుడు యీ దేశములో నివాసముగా నుండే పంచద్రావిళ్ళకు దృష్టిదోషము అక్కరలేనందున ఆ బ్ర్రాహ్మణులు ఆవరణలోపలను భోజనము ఛెయడానకు చలి యుపద్రవముగా వుంచున్నదని పగలు రెండుజాములవేళ మెద్దెమీద పయిదళములో యెండలో ఆకులు వేయించుకొని కాకుల బాధలేకుండా నాలుగు పక్కలా నలుగురు శూద్రులు తుపాకులు కాలుస్తూ యుండేటట్టు యేర్పరసుకొని యెండ సౌఖ్యముగా వున్నదని భోజము చేసినారు.

కాశివరకు తాటిచెట్లు కండ్లపడక పోయినా, గంగకు యిరుపక్కలా అనేక గ్రామాదులలో తాటిచెట్లు కలిగి యున్నవి. యిరువై యేండ్లకు మునుపు జాతులవాండ్లు పొట్టేటసు అనే గడ్డలు (బంగాళాదుంపలు) యీ దేశానికి తెచ్చి పయిరుపెట్టే క్రమమును యీదేశపు జనులకు నేర్పించినారు. అది మొదలుగా యీ దేశములొ యెక్కడ చూచినా వాటికి ఆలి అనే పేరు పెట్టి అమోఘముగా పయిరు పెట్టుచున్నారు. ఆ గడ్డలు పెద్దదినుసు నిమ్మకాయలంతేసి, చిన్నదినుసు గచ్చకాయలంతేసిగా అనేక రాసులుగా పన్నీరు పూలవర్ణముతో ఫలించి యెక్కడ చూచినా యీ ప్రాంత్యములలో అమ్ముచున్నారు. గంగలో