పుట:Kasiyatracharitr020670mbp.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాఖ అనే శ్లోకప్రకారము సమస్త లోకుల క్షేమము కొరకు ఈశ్వర ప్రార్ధన చేయుచున్న తమ కర్మాదులకు విరొధము లేక క్షాత్రధర్మముతో తంమును కాపాడే క్షత్రియ జాతిని గౌరవ పరచుచు, తమకు దొరకని దేశాంతరాలయందుండే పదార్ధాలను వాణిజ్యమూలకముగా తెచ్చి యిచ్చే వైశ్యులను లాలించి, తమకు ఉపచరించి సేవ చేసే శూద్రులను ఆదరింపుచు రమ్మని శాస్త్రనియమ మున్నది గాని వండేపెట్టడానకు అర్హుడయిన శూద్ర దృష్టే మనకు కూడదు; బ్రాహ్మణ వీధి లోనే శూద్రుడు రాకూడ దనే ఆచారము మూల స్మృతులలో ఇటువంటి అగౌరవాలకు ఆకరము పుట్టియున్నది గనుక ద్రావిడ దేశస్ధులు భూరూప మయిన జీవనాలు పుష్కలముగా కలుగుటచేత కర్మాదుల విషయ మయిన ఆచారాలు మెక్కుట మయి శూద్రులను నిండా తృణీకారము చేయుచు రావడముచేత, వారికి మాంసభక్షణ మొదలయిన దుర్మార్గములో బుద్ధితగిలి, స్నానాది కర్మములను వదిలి నికృష్టు లయి వారున్ను వారికి తక్కువ తెగ అయినవారున్ను ఈ నికృష్టములో పడి అవమానపడడ మేమి? సమానత్వము పొందగల మతములోనే ప్రవర్తింపుచున్నామని, క్రీస్తుమతస్థుల ప్రేరేపణకు లోపడుచున్నారు.

ఈ బ్రహ్మాండములో కన్యాకుమారి మొదలు కాశ్మీరమువరకు నుండే దేశము సర్వోత్తమ మయిన కర్మభూమియై, రామకృష్ణాద్యవతారములకు పాత్రభూతమయి, శాపానుగ్రహ శక్తులయిన అగస్త్యాది ఋషులకు వాసయోగ్యమయి యుండిన్ని, ఈ బ్రహ్మాండముయొక్క చివరను వసింపుచు పూర్వకాలమునందు పశుప్రాయులుగా నుండిన యింగిలీషువారిచేత యిప్పుడు యేలబడి యున్నది. నరుబ్బు ఇప్పుడు కర్మశూనులయిన ఆ యింగిలీషువారు ఈశ్వరకటాక్షమునకు ఈ కర్మదేశస్థులకంటే యెక్కువగా పాత్రులై ఉండవలసిన కారణ మేమని యోచించి నంతలో నాకు శ్రీరాములతోపచేసిన యుక్తి యేమంటే; తత్వబోధసాధన మయిన విద్యాబుద్ధి లేనివారికిన్ని స్త్రీ బాలుల