పుట:Kasiyatracharitr020670mbp.pdf/228

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


పూజలని ప్రసిద్ధముగా ఛేయుచున్నారు. 30 రూపాయలలో ముఖ్యమైన స్థలములలో మహాపూజలు జరుగుచున్నవి.

పట్టణమునకి దక్షిణ భాగము అసీతీరము నందు దుర్గాగుడి ఒకటి యున్నది. ఈ దేవత ఈ పట్టణమునకు కావలిగా వుండే శక్తియని పురజనులు మెండుగా ప్రతి మగళవారమున్ను వెళ్లి ఆరాధింపు చున్నారు. ఈ గుడి తక్కిన గుళ్ళకన్నా విశాలముగా నున్నది. సమస్త మయిన గుళ్ళున్ను యెక్కడ చూచినా నిత్యయాత్రచేసేవారు అభిషేకనిమిత్తమై పోశే ఉద్ధరిణి నీళ్ళతోనున్ను బిల్వదళములతో నున్ను తిలాక్షతలతోనున్ను నిండియుంచున్నది. యీబిల్వపత్రములు తిలాక్షతలున్ను తినడమునకు వృషభములు లోగా సంచరింపు చున్నవి. కాబట్టి పూజించ పొయ్యేవారు పుష్పమాలికలున్ను, బిల్వదళములున్ను, చేతులో తెలిసేటట్టు యుంచుకుంటే ఈ వృషభములు పయిన పడుతున్నవి. నిత్యయాత్ర చేసే నిమిత్తముగా వేలపర్యంతము స్త్రీలు, పురుషులున్ను, పిడికిలి కణిన బుట్టలలో డబ్బిలలో నున్ను బిల్వపత్రము, తిలాక్షతలున్ను ఉంచుకొని, మరియొకచేత ఉదకము తీసుకొని, చూచిన లింగానికిన్ని లింగము ఉండే ఆలయ ద్వారము మూసియుండే పక్షమందు ఆ ద్వారపు కడప మీద ఒక ఉద్ధరిణి ఉదకముతో అభిషేకము చేసి ఒక బిల్వపత్రము వేసి కొన్ని తిలాక్షతలు చల్లుచు వచ్చుచున్నారు. స్నాననియమము ప్రతి మనిషికిన్ని కలిగియున్నది. శూద్రులుకూడా శిరస్నానము చేయక భోజనము చేయరు. ఈ దేశపు బ్రాహ్మణులు ఇతర వర్ణాలను నిండా అన్నదరణ చేసి అగౌరవ పరచనందున కర్మహీనులుగా చేయవలెననే కీస్తు మతస్థుల ప్రయత్నము ఈ దేశములో ఈ సరికి మిక్కిలి సాగలేదు.

ద్రావిడ దేశములో శూద్రులనున్ను, ముఖ్యముగా చండాఆలులనున్ను అగౌరవ పరస్తూ, శూద్రుల దృష్టిన్ని చండాలుల సమీప వర్తిత్వమున్ను కూడదని నిండా అగౌరవ పరచడము చేత, వేల పర్యంతము ప్రజలు క్రీస్తు మతస్థులుగా పెదపాళెము మయిలాపూరు క్రీస్తుగుళ్ళ వుత్సవాదులో చూడబడుచున్నారు. బ్రాహ్మణులకు శ్రుతి చోదితములయిన కర్మాదులను చేసుకొనుచు "స్వస్తిప్రజాభ్యం: