పుట:Kasiyatracharitr020670mbp.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కున్ను భక్తిజనితమయ్యే నిమిత్తముగా ముఖ్యముగా కర్మాదులనున్ను బింబారాధనలనున్ను ఉద్ధరించిన పూర్వీకులయిన స్మర్తలు బింబాలకు మనోజ్ఞమయిన మధుఘృతాదూలతోనున్ను ఫలరసాలతొనున్ను అభిషేకము చేసి ఆలయాలు కట్టియుంచి అలంకరించి అర్చనచేసి రాజోపచారలాంచనలు జరగవలసిన వని వ్రాస్తే ఇటీవల ఉపస్మర్తలు భక్తినివృద్ధి పొందింప చేయవలెననే వెర్రితాత్పర్యముతో యెంత తేనె అభిషేకము చేస్తే అంత మంచిది, యెంత పెద్దగుడి చిత్రాలతో కట్టితే అంత పుణ్యము, యెన్ని విచిత్రాలతో అలంకరించితే అంత శ్రేష్టము, యెందరిని రూపవతులయిన దాసీలను రాజోపచార నిమిత్తముగా గుడిలో వుంచితే అంత గుణ మని వ్రాసినందున యధోచితము లయిన పంచామృతాభిషేకములను వదిలి అంతర్యామి రూపముతో పరమాత్మ వసింపుచు నుండే దేహములకు భొజ్యములయిన వస్తువులను విస్తరించి బింబముల మీద పోయుచు వ్యర్ధ పరచుచు రాసాగి దర్శనమాత్రము చేతనే కామవికారములను కట్టసాగిరి. మరిన్ని సాధారణపు స్త్రీపురుషులు ధరించే వికార వేషములతోనున్ను వికార చర్యలతోనున్ను బింబాలను అలంకరించసాగిరి. మరిన్ని ఆ గుడికంటె యీగుడిలో విభవము యెక్కువ అనిపించవలెనని పైపోటీలతో వ్యర్ధముగా ద్రవ్యవ్యయము చేసి పయిన చెప్పిన పనికి మాలిన పనులు జరిగించి అలాటి అలంకార విభవముల గుండా లోకులకు భక్తిని కలగజేయ సంకల్పించినందున సర్వాంతర్యామి యైన భగవంతునికి అది విరుద్ధముగా తోచినది.

ఆ ప్రకారమే బ్రాంహ్మణులను సత్కర్మముల నాచరింపుచు లోకుల శ్రేయస్సును ప్రార్ధింపుచు అందరినిన్ని ఆశీర్వదింపుచునుండు డని చెప్పితే మేము సర్వోత్కృష్టులమని అహంకరించి ఇతర వత్ణములను తృణీకరించ సాగిరి. అదిన్ని భగవంతునికి అసహ్యమయినట్టు తోచుచున్నది. సగుణ బ్రహ్మారాధన విషయమయి చిత్తము భక్తి కలిగి తదేకనిష్టతో ఉండేకొరకు ధ్యానారంభకాలము నందు, యధోచితముగా తగుపాటి మత్త ద్రవ్యమును సకృదావృత్తిపుచ్చుకొను