పుట:Kasiyatracharitr020670mbp.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అందరునున్ను పంచగంగా ఘట్టమందు స్నానమి చేస్తున్నారు. శ్రీరామ కటాక్షము యీ పంచరత్న దినములొనే నన్ను యీ కాశిలో ప్రవేశింప చేసినందున పున్నమస్నానము ఆ పంచగంగా ఘట్టములో చెయ్యడమయినది. యీ పంచగంగా ఘట్టము పంచపాండవుల తపోబలముచేత యింత ప్రసిద్ధమయినట్టు పురాణ సిద్ధము.

కాశి పట్టణమునకు ఉత్తరమున 'వరణ ' దక్షిణమున 'అసి ' అని రెండు నదులు కాలువలుగా గంగలో సంగమ మవుచున్నవి. అసి అనే కాలువ అతి స్వల్పము. యీమధ్యేవుండే భూమి వారణాసి అనే పుణ్య క్షేత్రమయినది. యీ అసివరణల మధ్యే గంగ ధనురాకరముగా ప్రవహింపువున్నది. గంగకు పడమటి యొడ్డున కాశీపట్టణము యేర్పడి యున్నది. అసివరణల మధ్యము అవిము క్తక్షేత్రము గనుక యిక్కడ దేహము వదలిన జీవాత్మునికి తారకోపదేశము అవుచున్నదని పురాణ ప్రసిద్ధము. గనుక గంగాతీరము నందు యిండ్లు స్నానఘట్టాలున్ను నారు పోసినట్టు వీధులకు కూడా యెనిమిది అడుగుల భూమి విడువ కుండా జానడు జానెడు భూమికి వేలమోడిగా రూపాయలు యిచ్చి స్థలము విశాలముగా కావలిసివస్తే మిద్దెమీద మిద్దెగా యేడేసి అంతస్థులు కూడా కట్టుకుని కాపురము చేస్తూవున్నారు. యీ అసి-వరణల మధ్యే గంగాతీరమందు భూమి కొనవలస్తే పూనా శ్రీమంతుడు *వగయిరాలకు శక్యమేగాని సామాన్యులకు వయిపులేదు. అసివరణల మధ్యే కేదార ఘట్టము మొదలు రాజఘాటు వరకు అహల్యాబాయి, !నాగపూరిరాజు, శింధ్యావగయిరాలు అనేకలక్షలు వ్రయముచేసి కాపురానికి యిల్లున్ను


  • పీష్వా అని చరిత్రలో ప్రసిద్ధిజెందిన మహారాష్ట్ర ప్రధానమంత్రి, తరువాత కొంతభాగము నకు రాజయ్యెను. పునహా అరని రాజధాని.

!అహల్యాబాయి ఇందూరు రాజగు మలహల్ రావు హోల్కారు భార్య ఈమె 20 అ ఏటనే భర్త మరణించాడు. కొమారు డప్రయోజకు డైనాడు. ఈమె సహగమనం చేయదలపగా ప్రజలు వారించి రాజ్యాధికారం వహించ మని ప్రార్ధించారు. 1765 మొదలు 30 సంవత్సరా లీమె ఇందూరును అతి సమర్ధతతో పరిపాలించింది. ఈమె సద్గుణములను, దాతృత్వమును, తెలివితేటలను ఇంగ్లీషువారు కూడా మెచ్చుకున్నారు. ఈమె హిందూదేశములో అనేక పుణ్యక్షేత్రాలలో గొప్ప దాన ధర్మాలు చేసి 1795 లో స్వర్గస్థురాలైంది.