పుట:Kasiyatracharitr020670mbp.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్నానానికి ఘట్టమున్ను శివప్రతిష్టకు గుడిన్ని ఒకటిగా కలిపి కట్టుతూ వచ్చినారు.

సవారీలలో స్నానానికి ఒక ఘట్టమునుంచి ఒక ఘట్టానికి పోవడము వీధుల కునందిచేత ప్రయాస గనుక చిన్నపడవలమీద పరువుగలవారు గంగగుండాపోతూ వస్తూ వుంటారు. ఆ ప్రకారము పోయి వచ్చేటప్పుడు చూడడమునకు ఆ పట్టణము అతిసుందరముగానున్ను అత్యద్బుతముగాను న్నుంచున్నది. అందులో శ్రీధర మునిషి అనే వాడు కట్టిన ఘట్టము, అహల్యాబాయి కట్టిన ఘట్టము మరికొందరు గోసాయీలు కట్టిన ఘట్టలున్ను సుందరముగా నున్నవి.

ఆ అసి-వరణల నడిమి పుణ్యఘట్టము లేవంటే పరణాఘట్టము, రాజఘట్టము, త్రిలోచన ఘట్టము, దుర్గాఘట్టము, పంచగంగా ఘట్టము, మణికర్ణికా ఘట్టము, దశాశ్వమేధఘట్టము,కేదారఘట్టము, హనుమద్ఘట్టము, అసిఘట్టము న్నునవి. త్రిలోసన ఘట్టమువద్ద చెన్నపట్టణములో కష్టం హవుసురేవు వలెనే సకల ధాన్యాలు భోళా అనే పెద్ద అంగళ్ళు పెట్టి మొత్తపు విక్రయాలు చేయుచు వున్నారు. రాజ ఘాటులొ ముఖ్యమయిన సుంకపు చావిడి వుంచున్నది.

కాశీవాసము యధావిధిగా చేశేవారు యీ అడుగున వ్రాసిన శ్లోక ప్రకారము ఆయా ఆలయాలకు వెళ్ళి అయా మూర్తులను ఆరాధించి రావలసినది. శ్లో|| విశ్వేశం మాధనం ధుండిం దండ పాణించ భైరవం | వందే కాశీం గుహాం భవానీ అనే అన్నపూర్ణ ఆలయము, ధుండి వినాయకుడి ఆలయమున్ను కేదారఘట్టానికి సమీపముగా మణికర్ణికకు పొయ్యె దోవలోనే యున్నవి. అటువెనుక దుర్గాఘట్టమువద్ద కాలభైరవుడి ఆలయము దండపాణి ఆలయము వుండియున్నది.

పంచగంగా తీమునందు బిందుమాధవుడి ఆలయము వున్నది. అక్కడికి సమీపముగా తురకల మశీదు ఒకటి ఆశ్చర్యకరమయిన యున్నతము కలిగి రెండు స్తూపీలతో నిర్మించపడి యున్నది. ఆ రెండు స్తూపీల కొనకు పోవడానికి లోపలనే మెట్లు కట్టియున్నది. ఆ రెండు