పుట:Kasiyatracharitr020670mbp.pdf/218

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


కని అయుదు రూపాయలున్ను భూరి యిచ్చి నేను దిగిన స్థలము ప్రవేశించినాను. ఆ మరునాడు నాతో కూడావచ్చిన బ్రాహ్మణులందరిచేత తీర్ధశ్రాద్ధాలు పెట్టించడ మయినది. నాలుగొ దినము నేను తీర్ధ శ్రార్ధము పెట్టడమయినది. యీ మహా స్థలములలో అన్ని శాఖల బ్రాహ్మణులున్ను సమూహాలుగా వున్నందున శాఖకు యాభై మంది వంతున అధిశ్రవణనకున్ను, యిష్టబంతికిన్ని పిలిపించినాను. పావులా దక్షిణతో వారు సంతోషించినారు.

యీ కాశిలొ మణికర్ణికకు మహాత్మ్యము వచ్చినందుకు కారణ మేమంటే విష్ణువు చక్రము చేత తీర్ధము కల్పించుకొని తపస్సు చెస్తూ వుండగా పార్వతీసమేతముగా శివుడు అక్కడికి వచ్చినంతలో పార్వతియొక్క కర్ణికామణి ఆ తీర్ధములో పడిపోయెను గనుక శివుడు వెతికినట్టున్ను, విష్ణు మాయచేత దొరకనట్టున్ను, తదనంతరము విష్ణువు బావమరిది వొప్పారితో హాస్యముచేసినట్టున్ను, తదనంతరము ఆ చక్రతీర్ధము పార్వతీకర్ణికామణినిన్ని శివుని మానసమునున్ను, ఆకర్షించి విష్ణుచక్రోద్భవమున్ను అయినందున గంగ భగీరధుని నిమిత్తము భూలోక ప్రవేశమయినప్పుడు యీతీర్ధమహాత్మ్యము తెలిసి యీతీర్ధ సంగమము చేసినది గనుక యీ మణీకర్ణికా ఘట్టము యీస్థలానికి అతి ముఖ్యమయినది. ఆ చక్ర తీర్ధములోనే ప్రధమస్నానమును కాశి ప్రవేశించగానే అందరున్ను చేయవలసినది. ఆ చక్రతీర్ధము మణికర్ణికా ఘట్ట సమీపమునందు ఒక చిన్నగుంటగా యున్నది. ఆ తీర్ధాన్ని గంగాపుత్రులు అక్తమించుకోవడముమాత్రమే గాక సదా ఆవరించుకుని వుంటున్నారు.

యీ కాశికి బహుపుణ్య కాలమున్ను, బహు మహోత్సవ కాలమున్ను, బహు జనాకర్షణ కాలములమున్ను యేదంటే కార్తీకమాసము. ఆ కార్తీకమాసములోను శుద్ధైకాదశి మొదలు పున్నమవరకు పంచదినములు పంచరత్నాలని పేరు వహించివున్నవి. యీకార్తీకమాసము మొప్పైదినములు లక్షావధి ప్రజలు కాశికి స్నానాల నిమిత్తముగా వస్తారు. కృత్తికా నక్షత్రము అదర్శవము కాక మునుపే