పుట:Kasiyatracharitr020670mbp.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కద్దా? అని ఆదిగినాను. కొన్నికొన్ని పురాణాదులలో పుత్రులు సన్యసిస్తే పురుష జన్మము కలిగేటట్టు ఉన్నది, కొన్నిపురాణాదులలో సర్వధాయెప్పుడున్ను స్త్రీలకు పురుషజన్మము లేదని పరిష్కారముగా వున్న దని చెప్పినాడు గనుక యీ యుక్తుల ద్వరా విచారించగా స్త్రీలు లేని పోని పురుష యోగ్యము లయిన కర్మముల జొలికి పోక వేదాంతాలు విచారించి శుష్కవేదాంతలు కాక, పతిశుశ్రూష కుటుంబ సంరక్షణ మొదలయిన ఐహికపు పనుల యెడలనే ప్రవిష్టులుగా ఉండుట యుక్తముగా తోచుచున్నది.

ఈ ప్రయాగలో సకల పదార్ధాలు దొరుకును. సకల విధమయిన పనివారున్నున్నారు. సీమసామానులు అమ్మే యింగిలీషు షాపుకూడా ఒక బంగాళీ వేసుకొని ఉన్నాడు. యీ ప్రయాగలో అక్టోబరు నెల 12 తేది మొదలు 22 తేది రాత్రి వరకు వసించి 23 తేది ఉదయాన బజిరా అనే యిల్లుగల పడవ ఒకటిన్ని. నావా అనే సాధారణపు పడవ ఒకటిన్ని బాడిగెకు తీసుకొని గంగగుండా ప్రయాణమై సాగివచ్చినారు. యీ బజరాలనే పడవలు సుమారు 60 అడుగుల నిడివిన్ని, 20 అడుగులు వెడల్పున్ను కలిగి ఒకటి వెనక ఒకటిగా మూడు అరయిండ్లు యేర్పడి ఉంటున్నవి. ఆ యిండ్లు మంచి పలకలతో కట్టి సుందరమయిన రంగువేసి యున్నవి. కడావటిది మరుగు అర. నడిమిది పడకటర. మొదటిది కచ్చేరి కూటముగా ఉంటున్నది. యీ అరల కింద సామాను ఉంచడానికి ఒక అంతస్తు ఉన్నది. ఈ మూడు అరలమీద సవారీలు మూడువుంచి 30 మంది బోయీలు వుండవచ్చును. దీనికి కొయ్యలతో నీళ్ళు తోసేవారు మాలీలు అని 14 మంది మాంజీ అనే చుక్కాణి తిప్పేవాడు ఒకడున్ను ఉన్నారు. యిటువంటి బజరాకు సాధారణ మయిన బాడిగె దినానికి 7 రూపాయిలు. ఇక్కడకలదారలని, శిక్కారూపాయిలని చెలామణీ అవుచున్నవి. ఈ రూపాయలు మన దేశపు రూపాయి 1 కి ఒక అణాయెక్కువ అనుకోవలసినది. యీబజరాలు ఫలాని ఊరికి వెళ్ళడానకు యిన్ని దినము లని సర్కారువారు నిరుకుచేసి ఉన్నారు. యీ పడవ ఒకరికి ఒక తావుకు బాడిగెకు వచ్చి మళ్ళీ వచ్చిన తావుకు పొయ్యేట