పుట:Kasiyatracharitr020670mbp.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్త్రీలకు గర్భధారణ నిమిత్తమయి ఆధోభాగమందుండే గ్రంధి ఫల కాలము రాగానే వీడబడి ఋతువనే సంజ్ఞను పొందుచున్నది. పురుషులకు మాయా సంబంధమయిన పూర్ధ్వ భాగమందుండే గ్రంధి ఫలకాలము రాగానే జ్ఞానోదయ సామాగ్రిని చేయడానికి వయిపుగా వీడబడిపోవుచున్నది. యిందుకు దృష్టాంత మేమంటే పురుషులకు యౌవనప్ర్రారంభమయిన వెనక బాల్యమునందుండే కంఠధ్వని సౌషవము వుండేదిలేదు; భేదింపుచున్నది. స్త్రీలకు మాత్రము జననాదారభ్య కంఠధ్వనియొకటే రీతిగా పురుషులకంటే హెచ్చుగా యధోచితమయిన శ్రావ్యతికలిగి ఉంటున్నది. యీరీతిని స్త్రీలకు పరమాత్మ సంబంధమయిన గ్రంధి వీడ బడి మాయా సంబంధమయిన గ్రంధి నిలిచి యుండడముచేత యెన్నటికిన్ని జ్ఞానోదయ మయ్యే పాటిబుద్దిన్ని స్థైర్యమున్నులేక మాయాసంబంధమయిన చాంచల్యముతో మనస్సు తల్లడింపుచున్నది; తద్వారా జ్ఞానమునిగా ముక్తిలేదు; గనుక స్త్రీలు ముక్తికి అర్హులుకారు; యధోచితముగా అజ్ఞాన జంతువులతో చేరినవారేను.

జ్ఞానార్హులు కాకపోతే అట్టేపోయెను కర్మభూమియందు ఉత్త్పత్తిఅయిన స్త్రీలకు మంచి కర్మాలు చేయు నిచ్చ పుట్టేటట్టుగా స్వర్గాది భోగాలనే మీది ఫలము కలదని తద్ద్వారా దేవతలతో సంభోగము కలుగుననే ఆశైనా వుంచరాదా అని యోచిస్తే అటువంటి ఆశపెట్టితే స్వకీయ పురుషుల యెడల భక్తిని వదిలి అటునియమించిన కర్మములే చేస్తూవుందురనే భయముచేత మన పూర్వీకులు ఆయాశకూడా పెట్టక వారికి చెప్పిన కర్మాలు యేమి ఉన్నా ఐహిక సంబంధమయిన అష్టపుత్ర బహుధనములున్ను భత్ర్రార్హనహ ఆయురారోగ్యములున్ను మాత్రమే సకల పురాణాదులలో చెప్పియున్నవి; తద్ద్వారా స్త్రీలు తిర్యగ్జంతువుల వలెనే యధోచితముగా పురుషులను భోగార్హలే కాని యితరము కాదని తొచుచున్నది.

యీ ప్రయాగ మహాక్షేత్రములో ఉండే పౌరాణికు డయిన మధురానాధు అనే మహారాష్ట్ర బ్ర్రాహ్మణుని స్త్రీలకు యేసుకృత కర్మముచేతనైనా పురుషజన్మము కలిగినట్టు పురాణేతిహాసములలో