పుట:Kasiyatracharitr020670mbp.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్పుడు మరిఒకడు బాడిగకు మాట్లాడుకుంటే ఆ నిరుకు దినాలలో సగము దినాలకే బాడిగయియ్య వలసినది. బజరాచేరే నిరుకుదినాలకు ఎంత తక్కువగా స్థలము చేరినా ఆ నిరుకుదినాల బాడిగె పూర్తిగా యివ్వవలసినది. అది యెట్లానంటే కాశికి ప్రయాగ నుంచి యీ కాలములొ బజరా 3 దినములకు చేరుతున్నది. అయినప్పటికిన్ని నిరుకయిన 15 దినాలకున్ను బాడిగె యియ్యవలసినది.

ఈప్రకారము దండు తీసుకొని అనేక పడవలు బంగాళానుంచి ప్రయాగకు వచ్చివుండి మళ్ళీ పొవుచుండగా ఒక బజరాను బాడిగెకు మాట్లాడి నిశ్చయము చేసుకున్నాను. యిది ఒకటే నాసల్తనకు నేను యిక్కడ ఉంచుకున్నంత మటుకు చాలును. అయితే దేశానికి పట్టుకుని పోవలసిన గంగాజలము యమున కలియకుండా ఇక్కడ దశాశ్వమేధ ఘట్టములోనే పట్టవలసినది నియమము గనుక సుమారు 400పళ్ల *గంగ 40 బానలలో పట్టియుంచినాను. ఆ గంగ కాశికి తీసుకురాగలందులకయి ఒకనావా 27 రూపాయిలకు మాట్లాడి కుదుర్చుకున్నాను. మెరకను నాలుగు దినాలకు కాశికి పోవచ్చును. ప్రవాహము తీసిన దినాలు గనుక గంగకుండా పోతే 6 దినములు పట్తునని యిక్కడివారు చెప్పినా పరీక్షార్దముగా నున్ను కూడావచ్చిన వారి అసోదా (విశ్రాంతి) నిమిత్తమున్ను ఊహించి గంగకుండా రావడ మయినది.

గంగా ప్రవాహకాలము ఇక్కడ శ్రావణ భాద్రపద మాసాలు. యిప్పట్లో తూర్పుగాలి కొట్టుచున్నది. ప్రవాహపు వడి ముందర గాలికూడా నిండా పనికిరాదు. యీ బజరాలకు మూడేసి చాపలు ఒక స్తంభమునకు కట్టుచున్నారు. నేను పోవడము తూర్పు గనుక నాకు గాలి యెదురయి యున్నది. యిక మంచుకాలము వచ్చే నెల మొదలు ఇక్కడ ఆరంభ మవుచున్నది. చైత్రమాసమునందున్ను, వైశాఖ మాసమునందున్ను, ఈ కార్తీకమాసమునందున్ను ఇక్కడ ఎండ తీష్ణముగా కాయుచున్నది. నాతో కూడా వచ్చిన సామగ్రిని మిరిజాపురమునుంచి కాశికి లొగడనే పంపించివేయగా మిగిలిన నాతో


  • చెన్నపట్నములో పాలు మొదలగు ద్రవములు కొలుచు కొలమానము ఒక పడి రమారమి ఒకటిన్నర సేరులు.