పుట:Kasiyatracharitr020670mbp.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నవాబు మంత్రి కట్టించినవి యీ స్థళములో వున్నవి. దేశాంతరస్థులకు అన్నము అహల్యాబాయి సత్రము నిలిచి పోయినది మొదలుగా శుద్ధముగా లేకవున్నది. త్రిస్థళయాత్ర చేసేవారు అందరున్ను యెట్లా? కాశిలో మాత్రము అన్నపూర్ణ ఆజ్ఞచేత ద్రావిడ దేశస్థులకు యిక్కడి వారికి బుద్ధి ప్రేరితమయి అనేక సత్రాలు యేర్పడి వున్నవేగాని యిక్కడ ఒక సత్రమయినా లేక వున్నది.

యీ క్షేత్రములో యమద్వితీయమనే కార్తిక శుద్ధ విదియ నాడు యమునాస్నానము బహు ముఖ్యము. యమధర్మరాజు ఆదినము తన తోడబుట్టు అయిన యమునను జూచే నిమిత్తమై యిక్కడికి వచ్చి ఆ దినము యమునలో స్నానముచేసేవారి వంశస్థుల కంతా యమదండన లేకుండా వుండేటట్టుగా వర మిచ్చినాడాట. ఆ దినము యమునా స్నానము నాకు రామబ్రహ్మము కలిగేటట్టు కటాక్షించినాడు.

యీ ప్రయాగ వూరు ఫాదుషా కోటకట్టిన వెనక బహు బస్తీ అయినది. ఇప్పుడు (ఊరు) కట్టి సుమారు నాలుగువేల యేండ్ల దాకా అయినది. లక్కునో నబాబు డిల్లి పాదుషాను స్వామిద్రోహము చేసి లక్కునో రాజ్యముతోకూడా యీ ప్రయాగను స్వాధీనపరచుకొని ప్రయాగ వాళీలకు పాదుషా యిచ్చిన మాన్యపు భూములు యావత్తు కట్టుకున్నాడు. పిమ్మట 30 సంవత్సరముల కింద కుంఫిణీవారు స్నేహపూర్వకముగానే యీ ప్రయాగను దీని చుట్టు ఉండేభూమితోకూడ తీసికొని త్రివేణి సంగమమువద్ధ వుండే కోటను బహుబలముచేసి భరతపురపు రాజు మొదలయిన గొప్పవారిని భద్రపరచడానికి తగుబాటిగా మిక్కటమయిన రస్తుతో కూడా కోటను కాపాడుతూ వున్నారు. కోట బహు ముచ్చటగా బయిటికి కనబడుచున్నది. ప్రత్యామ్నాయ పటవృక్షాన్ని కొటబురుజుకింద వుండే సరస్వతి తీర్ధానిన్ని దర్శనము చేసినాను. యీ ప్రయాగకు మొగలాయీలలో అలహాబాదు అని పేరుపెట్టినారు. ఆధికారస్థులు అదేప్రకారము యిప్పటికిన్ని వాడుకుంటారు. యీ అలహాబాదులో ఒక రెవెన్యూ కల్కటరు ఒక కస్టం కల్కటరు ఒక మేజస్ట్రేటు ఒక జడిజీయున్ను వుండివున్నారు. వీరికందరికి అధికారిగా ఒక కమిస్సనరును యేర్పరచి పెట్టినారు.