పుట:Kasiyatracharitr020670mbp.pdf/197

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


దానికి ప్రత్యామ్నాయముగా కోటలో ఒక నేలమానికెలో ప్రయాగేశ్వరుడు మొదలయిన లింగాలు బింబాలున్ను ఉండే తావున ఒక లావు మర్రికొమ్మను తెచ్చి యీ స్థళజ్ఞులు పాతివున్నారు. వాటిని లోకులు ఆరాధిస్తారు. "త్రివేణీ మాధనం సోమం భరద్వాజం చవాసుకిం, వందే ఒక్షయవటం శేషం ప్రయాగం తీర్ధనాయకం" అనే శ్లోకప్రకారము ఆ యెనిమిది తావులకు వెళ్ళి యిక్కడ దిన యాత్ర చేయవలసినది. గనుక ప్రత్య్హామ్నాయ మయిన అక్షయవటపూజ యిక్కడ అగత్యమయినది. అందులో సోమేశ్వరుడిగుడి మాత్రము యమునకు అవతలిగట్టున వున్నది. కడమ అన్ని గుళ్ళు ప్రయాగ క్షేత్రమందే వున్నవి; గనుక నిత్య యాత్ర రవంత ప్రయాసతో చేయవచ్చును.

యీ స్థళమాహాత్న్యములో యీ త్రివేణీతీరమందు ప్రతి గ్రహానకు బహు ప్రత్యచాయము చెప్పి వున్నది. గనుక భిక్షాటన మే స్వధర్మ మయిన బ్రాంహ్మణులు యిక్కడ వాసము చేయడానికి భయపడి యీ స్థళవాసమే మానినారు. యింత పుణ్యతీరమందు బ్ర్రాహ్మణులు లేకపోతే లోకులు కడతేర రనే తాత్పర్యము చేత లోగడ డిల్లీ పాదుషా కింది అధికారస్థులు కొందరు కనోజా బ్రాహ్మణులకు భూస్థితు లిచ్చి యిక్కడ యెల్లప్పుడు తీరవాసులుగా వుండేటట్టున్ను యీ తీరములో వారికి స్థలాధికారాన్నిన్ని కలగచేసి కొందరిని స్థాపించినారు. వారు ప్రయాగవాశీలని పేరు పెట్టుకొని యిప్పటికే 200మంది, 124 ఝండాలు వేసుకొని స్నానఘట్ట మందు బలంపీటలువేసిస్నానము చేయవచ్చే వారికి ఉపకృతులు చేస్తూ ఆయాచిత జీవనము యాత్రవారిగుండా చేస్తూవున్నారు. వీరుగాక పంచ ద్రావిళ్ళతో చేరిన మహారాష్ట్రులు 10 యిండ్లవారున్ను తెనుగు వారు మూడిండ్లవారున్ను నూరు యేండ్లుగా ఠాణాలనే పేరుపెట్టుకొని యిక్కడా వసిస్తూ వున్నారు.

ఒకటి రెండు ధర్మ శాలలు ద్వారకాదాసు లక్కునో